
వెరసి ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇక అతని స్థానంలో కొత్త కెప్టెన్గా డేవిడ్ వార్నర్ కు సారధ్య బాధ్యతలు అప్పగించింది ఢిల్లీ యాజమాన్యం. అయితే కెప్టెన్సీ అయితే వార్నర్ కు అప్పగించింది. కానీ ఇక పంత్ లాంటి కీలక ఆటగాడిని భర్తీ చేసేందుకు టీం మేనేజ్మెంట్ ఎవరిని జట్టులోకి తీసుకుంటుంది అన్నది మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఢిల్లీ జట్టులో ఫిల్ సాల్ట్ మినహా మరొక వికెట్ కీపర్ లేడు అని చెప్పాలి. ఖచ్చితంగా మరో వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ ని జట్టులోకి తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే ఇక ప్రస్తుతం రిషబ్ పంత్ స్థానాన్ని కేరళ వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ అయిన మహమ్మద్ అజారుద్దీన్ తో భర్తీ చేయాలని ఢిల్లీ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా మహమ్మద్ అజారుద్దీన్ కు దేశవాలి టి20 లీగ్ లో అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు దేశవాళి టి20 క్రికెట్లో 39 మ్యాచ్ లు ఆడిన అజరుద్దీన్ 741 పరుగులు సాధించాడు. అతడు ఇన్నింగ్స్ లో ఒక సెంచరీ తో పాటు రెండు అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇక అతడి అత్యధిక స్కోరు 137 కావడం గమనార్హం. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కి వచ్చి విధ్వంసం సృష్టించగలిగిన సత్తా హాజరుద్దీన్ కు ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఢిల్లీ యాజమాన్యం అతని వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.