
ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్ చేసింది. అయితే అటు సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు పరుగులు కట్టడి చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారు అని చెప్పాలి. రాజస్థాన్ ఏకంగా 2004 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన సన్రైజర్స్ బ్యాటింగ్ విభాగం మొత్తం పేక మెడల కుప్పకూలిపోయింది అని చెప్పాలి. ఎవరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో ఘోర ఓటమి తప్పులేదు. అయితే హోమ్ గ్రౌండ్ లోనే సన్రైజర్స్ ఇంత కారణంగా ఓడిపోవడాన్ని అటు అభిమానులు మాత్రం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పాలి.
ఒకవైపు సన్రైజర్స్ ఘోర ఓటమి చవి చూస్తే మరోవైపు అటు సన్రైజర్స్ కెప్టెన్ గా ఉన్న సౌతాఫ్రికా ప్లేయర్ ఐడెం మార్కరమ్ మాత్రం తన ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. ప్రస్తుతం నెదర్లాండ్స్ తో జరుగుతున్న వన్డే సిరీస్లో ఆడుతున్నాడు ఐరన్ మార్కరమ. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్లో తన ఫస్ట్ సెంచరీని నమోదు చేశాడు. 175 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 126 బంతుల్లోనే 17 ఫోర్లు ఏడు సిక్సర్లతో చెలరేగిపోయి 175 పరుగులు చేశాడు. దీంతో వెంటనే ఐరన్ మార్కరమ్ సన్రైజర్స్ లో చేరి ఇలాంటి ప్రదర్శన చేసి జట్టును గెలిపించి టైటిల్ అందించాలని కోరుకుంటున్నారు అభిమానులు.