
ఇలా ప్రేక్షకులు పట్టుకునే ఫ్లకార్డులు కొన్ని కొన్ని సార్లు కెమెరాల కంటపడుతూ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక యువకుడు ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వచ్చి ప్రదర్శించిన ప్లకార్డు మాత్రం హాట్ టాపిక్ గా మారి పోయింది అని చెప్పాలి. బెంగళూరులో అద్దెకు ఇల్లు దొరకడం మహా కష్టంగా ఉంది. అద్దె ఇల్లు కోసం జనం పడుతున్న కష్టాలు అన్ని కావు అంటూ ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. అయితే బెంగళూరులో ఇల్లు అద్దెకు దొరకాలంటే ఎంత కష్టంగా ఉంటుందో ఈ యువకుడు చేసిన పని చూసిన తర్వాత అందరికీ అర్థమవుతుంది.
ఒకవైపు స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంటే ఇతను మాత్రం స్టేడియంలో నిలబడి ఇందిరా నగర్ లో తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు కావాలి అంటూ ఫ్లకార్డు పట్టుకుని నిలబడ్డాడు. ఈ సందర్భంలో తీసిన ఫోటోని ఒక నేటిజన్ ట్విట్టర్ వైదికగా షేర్ చేయడంతో ఇది వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇది చూసి ఐపీఎల్ ను జనాలు ఇలా కూడా వాడేసుకుంటున్నారా అని ఎంతమంది కామెంట్లు చేస్తున్నారు అని చెప్పాలి.