
అలాంటిది ఏకంగా అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న వ్యక్తి ఒక అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అనే వార్త ఎంత సెన్సేషన్ సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకకు సంబంధించిన ఇలాంటి వార్త సోషల్ మీడియాను ఊపేసింది. శ్రీలంక జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న ధనుష్క గుణతిలక ఏకంగా తనపై అత్యాచారయత్నం చేశాడు అంటూ ఒక యువతి కేసు పెట్టడం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొన్నాళ్లపాటు అటు శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా అతనిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
దీంతో ఇలా లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీలంక క్రికెటర్ ధనుష్క ధనుష్క గుణతిలకకు కాస్త ఊరట లభించింది అని చెప్పాలి. ఎందుకంటే ఆయనపై నమోదైన నాలుగు కేసుల్లో తగిన ఆధారాలు లేవని మూడు కేసులను ఆస్ట్రేలియాలోని సిడ్నీ కోర్టు కొట్టివేసింది. గత ఏడాది టి20 వరల్డ్ కప్ సమయంలో డేటింగ్ యాప్ లో పరిచయమైన యువతి.. తన అనుమతి లేకుండా ఇంట్లోకి వచ్చి ధనుష్క గుణచిలక అత్యాచారం చేశాడంటూ కేసు పెట్టింది. దీంతో ఇక ఆస్ట్రేలియాలోనే అతని అరెస్టు చేశారు. ఇక అతన్ని అక్కడే వదిలేసి శ్రీలంక టీం స్వదేశానికి వచ్చేసింది. అంతేకాకుండా అతనిపై నిషేధం కూడా విధించింది.