
రెండేళ్ల క్రితం.. అంటే 2018 ఫిబ్రవరి 12న కుజూర్ అనే 50 ఏళ్ల వ్యక్తి ఓ ఇంట్లోకి దూరాడు. అయితే ఆ సమయంలో ఇంట్లో ఓ ఐదేళ్ల బాలిక మినహా ఎవరూ లేరు. కట్ చేస్తే ఆ బాలిక తల్లి ఇంటికొచ్చేసారికి ఆ పాప రెండు చేతులూ గట్టిగా పట్టుకుని ఉన్నాడు కుజూర్. బాలిక ప్యాంటు జిప్ తీసి ఉంది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించడంతో.. పోలీసులు కుజూర్ పై పొక్సో చిత్రం కింద కేసు నమోదు చెయ్ అరేటు చేసారు.
ఈ కేసులో కింది స్థాయి కోర్టు నిందితుడికి ఐదేళ్ల శిక్ష విధించింది. పోక్సో చట్టం కింద ఇంట్లోకి చొరబడడం, దౌర్జన్యం, లైంగిక వేధింపులు, తీవ్రమైన లైంగిక వేధింపులు వంటి అభియోగాలపై పలు సెక్షన్ల కింద అతడికి శిక్ష విధించినట్లు తెలిపింది. అయితే ఈ తీయపుపై కుజూర్ హైకోర్టుకెక్కాడు.
దీనిపై సింగిల్ బెంచ్ ఈ నెల 15న తీర్పు వెలువరించింది. లైంగిక దాడి చేయాలన్న ఉద్దేశంతో భౌతికంగా తాకినప్పుడు మాత్రమే పోక్సో చట్టం కింద ‘లైంగిక వేధింపులు’గా పరిగణించాల్సి ఉంటుందని, అంతేకానీ జిప్ తీసినంతమాత్రాన అది లైగిక వేధింపుల కిందకు రాదని న్యాయమూర్తి పేర్కొన్నారు.
'బాధితురాలి తల్లి సాక్ష్యం ప్రకారం.. సదరు నిందితుడు చిన్నారి చేతులు పట్టుకున్నాడు. జిప్ తీశాడు. అంతే ఇలాంటి చర్యలు లైంగిక వేధింపుల కిందకు రావు. అందువల్ల 5 ఏళ్ల జైలు శిక్ష విధించడం అసాధ్యం. అందువల్ల ఆ ఆరోపణలన్నీ తొలగిస్తున్నాను. అయితే మిగిలిన సెక్షన్ల కింద పాల్పడిన నేరాలకు గానూ అతడికి 5 నెలల శిక్ష విధించడం జరుగుతుంది. కానీ నిందితుడు ఇప్పటికే 5 నెలల నుంచి జైల్లో ఉంటున్నాడు. అందువల్ల అతడిని మరింత సమయం జైల్లో ఉంచడం కుదరద'ని న్యాయపూర్తి వెల్లడించారు.
ఇదిలా ఉంటె ఇదే బెంచ్, ఒకే న్యాయమూర్తి పుష్ప గానేడివాలా ఇంతకు ముందు కూడా ఇలాంటి తీర్పునే చెప్పారు. దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. జనవరి 19న సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పు వివాదాస్పదం కావడంతో సుప్రీంకోర్టు దీనిపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిండు. తాజాగా అదే బెంచ్ న్యాయమూర్తి మళ్లీ అలాంటి తీర్పునే ఇవ్వడం ప్రస్తుతం వివాదాస్పదం అవుతోంది. అయితే మరీ ఈ తీర్పుపై కూడా సుప్రీం స్పందిస్తుందేమో చూడాలి.