
ముఖ్యంగా ఈ పువ్వులు అమ్మాయిలను ఆకర్షిస్తున్నాయి. ఈ డిమాండ్ మూలంగా అవి అంతరించిపోతున్నాయి. దీంతో 'నెపెంథెస్ హోల్డెని'గా పిలువబడే ఫాలిక్ ఆకారపు పెనిస్ ఫ్లవర్స్‌తో ఆడుకోవద్దని కాంబోడియా ప్రభుత్వం ఆ దేశ పౌరులను హెచ్చరించారు. కొందరు మహిళలు ఈ పూల మొక్కలను పీకెసిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి.అందుకు సంభంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పర్యావరణ మంత్రిత్వ శాఖ తాజాగా కఠినమైన ప్రకటన విడుదల చేసింది. 'సహజ వనరులను ప్రేమిస్తున్నందుకు ధన్యవాదాలు. కానీ పీకేయడం వల్ల ఈ మొక్కలు అంతరించిపోతాయి. భవిష్యత్‌లో ఇలా చేయొద్దు' అని ప్రకటనలో పేర్కొంది..మరోసారి ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పింది.
ప్రత్యేకమైన పువ్వులు గల ఈ మాంసాహార ఉష్ణమండల కాడ మొక్కలు సముద్ర మట్టానికి 600 మీటర్ల నుంచి 800 మీటర్ల ఎత్తులో పెరుగుతాయి.ఈ పూల ఆకారం కారణంగా వీటిని పెనిస్ ప్లాంట్'గా పిలుస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి రక్షిత జాతిగా ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో స్థానికులు, పర్యాటకులు ఈ వృక్షజాలాన్ని నేల నుంచి పీకేసి సోషల్ మీడియాలో పోస్టుల కోసం సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా 129 రకాల కాడ మొక్కలు ఉన్నాయని, వాటిలో ఐదు కంబోడియాలోని పలు ప్రాంతాల్లో పెరుగుతాయని పర్యావరణ శాఖ ప్రతినిధి చెప్పారు. ఈ పూలను చూసెందుకు జనాలు ఎగబడటం విశేషం..అయితే చూసి ఆస్వాదించాలి కానీ వాటిని ఇలా చేయడం భావ్యం కాదు అని గుర్తు చేసింది.