అణ్వస్త్ర దేశంగా ఉన్న రష్యా ఉక్రెయిన్ తో గత 11 నెలలుగా యుద్ధం చేస్తూనే ఉంది. న్యూక్లియర్ వార్ వస్తే ఎలా? రష్యా, ఉక్రెయిన్ మధ్య అణు యుద్ధం జరగనుందా? జెపొ జెజరియాలోని అణు విద్యుత్ కేంద్రం వద్ద గతంలొ జరిగిన దాడిలో గతంలో ఆ పవర్ ప్లాంట్ కు ఏం జరగలేదు. కాబట్టి అందరూ సురక్షితంగా ఉన్నారు. ఒక వేళ అణు విద్యుత్ కేంద్రం ఉన్న జెపొ జెజరియా రష్యా పరమైతే ఉక్రెయిన్ దీనిపైన దాడి చేస్తే ఏమవుతుంది. రష్యా చూస్తూ ఊరుకుంటుందా? అది కూడా అణు దాడి తప్పక చేస్తుంది. దీంతో తీవ్ర విధ్వంసం తప్పదు.


అణ్వస్త్ర ఆయుధాలను అడ్డుపెట్టుకొని భయపెట్టకూడదన్ని నైతిక నియమం. ఒకానొక సమయంలో దేశ ప్రధాని మోడీ సైతం పాక్ చేస్తున్న అతికి తన నోటితోనే సమాధానమిచ్చారు. మా వద్ద కూడా అణు బాంబు ఉంది. అది మేమేమీ దీపావళి లో కాల్చే టపాసు కాదు. సమయం వచ్చినప్పుడు దాన్ని కచ్చితంగా వాడుతాం అన్నారు. దీంతో పాక్ నోటికి తాళం పడింది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఉన్న అణు విద్యుత్ కర్మాగారం నుంచి ఉక్రెయిన్ గనక దాడి చేయాలని భావిస్తే రష్యా ఏమాత్రం ఊరుకోదు. ఇదే కనక జరిగితే అణు యుద్ధం తప్పక వస్తుంది. ఆ తర్వాత మనిషి చేతుల్లో ఏమీ ఉండదు.


కాబట్టి ఇప్పుడే ఏం జరిగినా ఏదీ జరగకుండా ఉండాలన్నా ఉక్రెయిన్ సంయమనం పాటించాల్సిందే. ఒక్కసారి అణు బాంబు పడిన తర్వాత ఎవరూ ఏం చేయలేరు. జపాన్ లోని హిరోషిమా, నాగసాకి లో ఇప్పటికీ అణు బాంబు నాటి భీకర దృశ్యాలు, ఆ ప్రాంతంలో గడ్డి కూడా మొలవని పరిస్థితి. కాబట్టి అణున యుద్ధం రాకుండా రష్యా, ఉక్రెయిన్ లు చర్యలు తీసుకుంటేనే యూరప్ దేశాలతో పాటు అందరికీ మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: