
మహాత్మా గాంధీ హత్య ఘటనను వక్రీకరిస్తున్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మహాత్మా గాంధీని హత్య చేసిన వాస్తవ చరిత్రను నేటి తరానికి తెలుపాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బోయినపల్లి వినోద్ కుమార్ అంటున్నారు. ఈ విషయంలో ధైర్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్న బోయినపల్లి వినోద్ కుమార్.. లేకుంటే చెప్పుకున్నోడిదే చరిత్ర అవుతుందన్నారు. మహాత్మా గాంధీ హత్యతో మతోన్మాద ఉగ్రవాదానికి బీజం పడిందని.. రాజ్యాంగం మేరకు మత విశ్వాసం అన్నది వ్యక్తిగతమని, హిందూ, ఇస్లామిక్, క్రైస్తవ మత ఉన్మాదం ప్రమాదకరం అని, ఇలాంటి ఉన్మాదాన్ని తుధముట్టించెందుకు యువత కంకణం కట్టుకోవాలని వినోద్ కుమార్ అంటున్నారు.
భారతదేశ స్వాతంత్ర ఉద్యమ కాలంలో గాంధీకి మహాత్మా అనే పేరు నామకరణం జరిగిందన్న బోయినపల్లి వినోద్ కుమార్... స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ స్ఫూర్తి గొప్ప మైలురాయి అని తెలిపారు. గాంధీని మహాత్మా అని పేరుతో పిలువడానికి బిజెపి నాయకులు ఇష్ట పడటం లేదని... దేశ స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని తొమ్మిది సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని అనుభవించిన జవహర్ లాల్ నెహ్రూను కించపరుస్తూ.. బిజెపి నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇది విచారకరమని బోయినపల్లి వినోద్ కుమార్ అంటున్నారు.
ఏ ఒక్క రోజు కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాలుపంచుకోని.. కనీసం తొమ్మిది రోజులు కూడా జైలుకు వెళ్లలేని బిజెపి నాయకులు తామే గొప్ప దేశభక్తి ఉన్న నాయకులు మని చెప్పుకోవడం విచారకరమంటున్నారు బోయినపల్లి వినోద్ కుమార్.