అమెరికా పెట్టుబడిదారు జార్జి సొరిస్ ప్రసంగంపై జై శంకర్ పంచులు విసిరారు. ఈయన అధికారికంగా చేసిన ప్రసంగంపై ఇప్పటికే మంత్రి స్మృతి ఇరానీ విరుచుకుపడ్డారు. ఆయన చెప్పిన మాటలు అన్ని వట్టి అబద్దాలు అన్నారు. జై శంకర్ మాట్లాడుతూ.. భారత దేశాన్ని ఎవరూ శాసించలేరని అలాంటి అపోహలే ఉంటే వాటిని వదిలిపెట్టుకోవాలని సూచించారు.


బిలినీయర్ ఇన్వెస్టర్ జార్జి సోరిస్ ఒక సమావేశంలో మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రజాస్వామ్యం పునరుజ్జీవనం కావాలని కోరుకుంటోంది. ప్రపంచంలోని ప్రసిద్ధ ఇన్వెస్టర్ అదానీ కంపెనీలు తీవ్రంగా నష్టపోయినప్పటికీ పార్లమెంట్ లో ప్రధాని మోడీ నోరు మెదపకపోవడం సభకు సమాధానం చెప్పకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. దీనిపై జైశంకర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో ప్రభుత్వం ఎప్పుడూ మెలకువగానే ఉంటుంది 92 ఏళ్ల బిలియనీర్‌.. వృద్దుడు.. దేశంలో పాలన వ్యవస్థ గురించి ఆయనకు ఆందోళన అవసరం లేదని అంటూ చురకలంటించాడు.


1.4 బిలియన్ ప్రజలు ఉండే ఈ దేశంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తి మాత్రమే పాలన వ్యవహారాలను చూస్తారు. ప్రజలను అభివృద్ది బాటలో నడిపించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. గొప్పల్లో, ఉన్న వాళ్లు పాలించే రాజ్యం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలిపించిన నాయకుడు దేశ ప్రజలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉంటారు. అదానీ వ్యవహారంలో ప్రధాని మాట్లాడలేడని అనడం గొప్ప ఇన్వెస్టర్ గా ఆయనకు సరైనదిగా అనిపించి ఉండొచ్చు. అన్ని ఆయనకు నచ్చినట్లుగా ఉండాలని అనుకోవడం అవివేకం. ఆ విధానం నుంచి జార్జ్ సొరిస్ బయటపడాలని కోరుకుంటున్నానని అన్నారు.


జార్జి సోరిస్ భారత్ లో పాలన వ్యవస్థలో మార్పు వచ్చింది. అది ఇలాగే కొనసాగితే ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నానని అన్నారు. ఈ వ్యాఖ్యలపై జై శంకర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. అదానీ గురించి ఇన్ని రోజులు మాట్లాడని వారు ప్రధాని, అదానీ గురించి వ్యాఖ్యలు చేయడం భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రగా భావించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: