
ఈ సమయంలో భారత్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపడానికి కారణం చైనా ఏ క్షణంలోనైనా తైవాన్ పై యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు దానిని అమెరికా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఎలక్ట్రిక్ వస్తువుల తయారీలో 40% ఈ కంపెనీ తయారుచేసినవి కావడమే ఇక్కడ ప్రత్యేకమైన అంశం. గుజరాత్ లో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఈ కంపెనీ ముందుకు వచ్చింది. గుజరాత్లో సెమి కండక్ట్ చిప్స్ తయారు చేయడానికి రెడీ అయింది.
అలాగే వేదాంతతో కంప్యూటర్ చిప్స్ తయారు చేసేందుకు సిద్ధపడింది. దీనికి మరో కారణం భారత్లో నైపుణ్యం ఉన్నటువంటి యువత ఎక్కువగా ఉండటం తక్కువ సాలరీకి ఏదో పని చేసేందుకు సిద్ధంగా ఉండడం. తైవాన్ కంపెనీలు భారత్ ను ఎంపిక చేసుకోవడానికి కారణం యువత అని చెప్పవచ్చు. ఈ ఫాక్స్ కాన్ కంపెనీ రియల్ వరల్డ్ వెదర్ కు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ను తయారు చేసేందుకు భారత్ ను ఎంచుకుంది. ఆపిల్ డివైసెస్ ని కూడా తయారు చేస్తుంది.
వీటన్నిటికీ ప్రధాన కారణం అమెరికా చైనాపై ఆంక్షలు విధిస్తే అక్కడ వ్యాపారం చేయడం గాని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడం ఇబ్బంది అవుతుంది. మొత్తం మీద ఈ కంపెనీ భారత్ లో పెట్టుబడులు పెట్టడం అనేది భారత యువతకు కలిసి రావడంతో పాటు దేశంలో అనేక కంపెనీలు రావడానికి అవకాశం ఉంటుంది. లక్షల మంది యువతకు అవకాశాలు వస్తాయి.