
దీనికి వ్యతిరేకంగా ఇజ్రాయిల్ వీధుల్లో వీరు నిరసనలు తెలుపుతున్నారు. న్యాయవ్యవస్థ అధికారాలు తగ్గిస్తే అది రాజ్యాంగ పరంగా అధికారం మొత్తం ప్రభుత్వంలోని ప్రధాని, అధ్యక్షుడు చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇలాంటి సమయంలో అక్కడ ఉన్న న్యాయవ్యవస్థను అధికారుల గుప్పెట్లో పెట్టుకోవాలని చూడటం వల్ల దేశంలో కోర్టుల్లో న్యాయం జరగకపోవచ్చని ఆవేదన వ్యక్తం అవుతుంది. ఇలాంటి పరిస్థితి ఇజ్రాయిల్ లో వస్తుందని ఆ దేశంలోని పౌరులు అనుకోలేదు.
దేశవ్యాప్తంగా మాజీ సైనికాధికారులు చేస్తున్న నిరసనలు ఇజ్రాయిల్ లో విప్లవం వస్తుందన్న భావన కలిగేలా ఉంది. కానీ బెంజిమన్ నెతన్యహు మాత్రం ఈ విషయంలో ఎక్కడ తగ్గేది లేదని చెబుతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి మాజీ సైనికాధికారులకు మధ్య జరుగుతున్న సంఘర్షణ ఎక్కడి వరకు పోతుందన్నది తెలియడం లేదు. సైన్యం, ఇతర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న మాజీ సైనికాధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో ప్రభుత్వానికి మద్దతు ప్రకటించం అని చెబుతున్నారు. ఇజ్రాయిల్ రాజధాని టెల్ అవీవ్ లో దీని గురించే మాజీ సైనికాధికారులకు ప్రభుత్వానికి మధ్య ఒక రకమైన సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతుంది. ఇప్పటివరకు ఇజ్రాయిల్ కు పాలస్తీనా తోనే ఇబ్బంది ఉండేది. ప్రస్తుతం సొంత మనుషుల్లో నిరసన గళం పెరిగిపోయింది.