ఒక పక్కన కాశ్మీర్ కి సంబంధించి ఆర్టికల్ 370, 35ఏ తర్వాత జరిగిన పరిణామాలను గురించి అమెరికాలో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశాన్ని పాకిస్తాన్ అనుకూలురు వచ్చి దాడి చేసి ఆపివేసినా అక్కడ ప్రభుత్వం ఏమి చర్య తీసుకున్నట్టు కనపడలేదు. కానీ దీనిపై ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ దుశ్చర్యకి భారతదేశం చెక్ పెట్టింది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంతకుముందు ఏం చేసేది అంటే కాశ్మీర్ ఏర్పాటు వాదులను తీసుకెళ్లి భారత్ గురించి పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితిలో మానవ హక్కుల సంఘాల దగ్గర వాళ్ల దగ్గర తప్పుడు ఉపన్యాసాలు ఇచ్చేది.


అదంతా గమనించుకుంటూ వస్తూ, ఓపిక పడుతూ వస్తున్న భారత్ ఇప్పుడు రివర్స్ యాంగిల్ లో  పాకిస్తాన్ ని టార్గెట్ చేస్తుంది. ఆ విధంగా భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నప్పుడు అదే ఐక్యరాజ్యసమితి వేదికగా స్వచ్ఛంద సంస్థలతో పాకిస్తాన్ మీద ఉపన్యాసాలు ఇప్పిస్తుంది. భారత్  చేసిన ఈ పనితో  షాక్ తినడం పాకిస్తాన్  వంతు అవుతుంది. ఇది అనూహ్యమైన పరిణామం. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశంపై  కాశ్మీరీ కార్యకర్తలు దాడి చేశారు, ఇంకా అవమానించారు. కాశ్మీర్‌ లో ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తూ, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న భారతదేశానికి చెందిన కాశ్మీరీ కార్యకర్తలు పాకిస్తాన్‌ కు పిలుపునిచ్చారు. వారు బెలోచిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆందోళన వ్యక్తం చేశారు.


అంతే కాకుండా ప్రపంచ మానవ హక్కుల సంఘం దీనిపై తక్షణ జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఒక ప్రాంతంలో టెర్రర్ రిలేటివిటీ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడం ఆర్టికల్ 370 యొక్క సంక్షిప్తీకరణ అని కూడా వారు నొక్కిచెప్పారు. ఒక పక్కన కాశ్మీర్ కు సంబంధించి, పాక్ వ్యవహారాల గురించి పాకిస్తాన్ తో స్టేట్మెంట్ ఇప్పిస్తే అదే సందర్భంలో పాకిస్తాన్ లోని పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి వాళ్ళ హక్కులు పోతున్నాయని అంటూ అక్కడే మరి కొంతమంది ఉపన్యాసాలు ఇవ్వడం అనేది ఇక్కడ కీలకమైన పరిణామం.

మరింత సమాచారం తెలుసుకోండి: