
నయా భింద్రన్ వాలే అని ఈ వ్యక్తిని పిలుస్తున్నటువంటి సందర్భంలో ఆ వ్యక్తి వెళ్లిపోయాక ఏ ఏరియాలో గొడుగు పట్టుకుని తిరిగాడు, ఏ ఏరియాలో బట్టలు మార్చుకు తిరిగాడు అన్నటువంటివి మాత్రమే వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు కానీ వాడు ఎక్కడున్నాడు అనే విషయాన్ని మాత్రం పసిగట్టడం లేదు. ఆ వ్యక్తి నేపాల్ కు పోయి, నేపాల్ నుంచి పాకిస్తాన్ కి పారిపోయి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ కి పోవచ్చూ, ఎలాగైనా పోవచ్చు ఆ వ్యక్తి. లేదా పాక్ బోర్డర్ దాటిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు, పాక్ సహకరిస్తుంది కూడా దానికి.
అట్లాంటి వ్యక్తి మీద కాన్సన్ట్రేషన్ చేయడం లేదు. ఈ వ్యక్తికి సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యక్తి పైపైకి ఉద్యమం చేయడం లేదని పాకిస్తాన్ నుండి వచ్చేటువంటి డబ్బులు, చైనా నుండి ఆయుధాలు వీటన్నింటినీ తీసుకుని ఇక్కడ పెద్ద యుద్ధమే చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది.
పాకిస్తాన్ లో డ్రగ్స్ కి అలవాటు పడ్డ యువతకి ఆయుధాల శిక్షణను ఇచ్చి వాళ్ళతో ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు అన్నట్లుగా తెలుస్తుంది. వాళ్లకు ఆయుధ శిక్షణ ఇచ్చే ప్రదేశాన్ని కనుక్కున్నారు. అంతా బానే ఉంది కానీ, అసలు వాడు దొరికే దాకా ప్రమాదమే. మరి ఎప్పుడు ఆ వ్యక్తిని పట్టుకుంటారో చూడాలి.