ఇండియాలోనే రాజకీయాలు చెత్తగా ఉంటాయనుకుంటే అమెరికాలో మరీ దారుణంగా తయారయ్యాయి. పోర్న్ స్టార్ స్టారమి డానియల్  కు కోటి రూపాయాల లంచం ఇచ్చి తనతో ఉన్న వివాహేతర సంబంధం గురించి బయటపెట్టొద్దని అమెరికా మాజీ అధ్యక్షుడి ట్రంపు చెప్పడనే ఆరోపణలతో ఆయన్ను అరెస్టు చేశారు కూడా. తర్వాత విడుదల అయ్యారనుకోండి.
 

లాయర్ కు పోర్న్ స్టార్ విషయంలో ఈ లంచం ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ అందరూ అమెరికన్ అధ్యక్షుల్లా కాకుండా ట్రంపు తనదైన శైలిలో పరిపాలన చేశారు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్లారు. విదేశీయులపై కఠినమైన ఆంక్షలు పెట్టినా ఆయన అఫ్గానిస్తాన్, ఇరాన్, ఇరాక్, సిరియా లాంటి దేశాలపై యుద్ధం చేయ లేదు. ఆ దేశాల్లో రక్తపుటేరులు పారించలేదు.


తన రూటు సపరేటు అంటూ పాలన కొనసాగించాడు. ట్రంపునకు కొన్ని దురలవాట్లు ఉన్నది వాస్తవమేనని అందరికీ తెలిసిందే. అమెరికాలో ఎక్కువ మంది చూసే గేమ్ డబ్ల్యూ డబ్ల్యూ ఈలో అతను పెట్టుబడులు కూడా పెట్టారు. గొప్ప వ్యాపారవేత్త. రాజకీయాల్లోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే అమెరికా అధ్యక్షుడిగా గెలిచి ప్రపంచంలోని రాజకీయ నిపుణులను ఆశ్చర్యానికి గురి చేశారు. అది కూడా హిల్లరీ క్లింటన్ పై గెలవడం అనేది మామూలు విజయం కాదు.


మీడియా, రాజకీయ పార్టీలు అన్ని ఏకమై హిల్లరీ క్లింటన్  గెలుస్తుందని చెప్పినా ట్రంపు మాత్రం తానే గెలుస్తాననే ధీమాతో ఉండి అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందారు. అప్పుడు రష్యా తో చేతులు కలిపి గెలిచాడనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఏదైమైనా ట్రంపు హయాంలో అమెరికా ఏ దేశంతో కూడా యుద్దానికి దిగింది లేదు. ఆ ప్రాంతాలను విధ్వంసం చేయలేరు. అయినా ఆయనపై పోర్న్ స్టార్ ను అడ్డు పెట్టుకుని కేసులు పెట్టి అరెస్టు చేసే స్థాయికి అమెరికా ప్రభుత్వం దిగజారింది. వచ్చే ఎన్నికల్లో ట్రంపు పోటీ చేస్తానని అంటున్నారు. మరి విజయం సాధిస్తాడా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: