చైనా జనాభాను దాటేసి భారత్ ముందుకెళ్లిపోయింది. ప్రస్తుతం రష్యా నుంచి ఆయిల్ ను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. గతంలో ఎక్కువగా అరబ్ కంట్రీల నుంచి దిగుమతి చేసుకునే వాళ్లం. కానీ ఇప్పుడు ఎవరూ తక్కువకు ఇస్తే అక్కడే కొనుక్కుని దేశాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళుతున్నాం. ఒకప్పుడు చైనాతో విపరీతంగా వ్యాపారం చేసేవాళ్లం. కానీ ఇఫ్పుడు వ్యాపారాన్ని మొత్తం తగ్గించేసాం. అమెరికా తో కూడా కొన్ని రకాల వ్యాపారాలను మనకు నచ్చిన విధంగా చేస్తున్నాం.


ఎందుకంటే ఒకప్పటి పార్ములాను ప్రధాని నరేంద్ర మోదీ ఫాలో కావడం లేదు. ఎందుకంటే ప్రధానిగా మోదీ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాల వల్ల సమాజంలో ఇండియాకు లాభం చేకూరుతోంది.  ఉదాహరణకు చైనా నుంచి వచ్చే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ దిగుమతి చాలా వరకు తగ్గించేసుకున్నాం. దీంతో చైనాకు ఆర్థికంగా దెబ్బతీసినట్లయింది. అలాగే ఇతర దేశాలతో సత్సంబంధాలు పెరిగాయి. ఇలా ప్రతి ఒక్క విషయంలో ప్రణాళికతో వివిధ దేశాలతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నాం.


చైనాను దాటి భారత్ తో వ్యాపార సంబంధాలను పెంచుకున్నట్లు అమెరికా వైట్ హౌస్ సెక్రటరీ ప్రకటించారు. యూఎస్ వరుసగా రెండు సంవత్సరాలుగా భారత్ తో ఎక్కువగా వ్యాపారాలు సాగిస్తున్నట్లు చెప్పింది. 2021 సంవత్సరంలో 119 బిలియన్ డాలర్లకు సంబంధించిన వ్యాపారాలు కొనసాగిస్తే, 2022 సంవత్సరంలో అది 6 శాతం పెరిగినట్లు వైట్ హౌస్ సెక్రటరీ తెలిపారు. ఇదే సమయంలో చైనాతో 80.51 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు తెలుస్తోంది. అంటే ఇండియా, అమెరికా వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఎంతో మెరుగుపడ్డాయని తెలుస్తోంది.


దీని వల్ల అమెరికాకు దగ్గరవ్వడం, చైనాకు దూరంగా ఉంటూనే, దాన్ని ఆర్థికంగా దెబ్బతీయడం అనేది భారత్ వేస్తున్న ఎత్తుగడ. ఆయిల్ కొనుగోలు విషయంలో కూడా గతంలో ఎక్కువగా గల్ఫ్‌ దేశాలపై ఆధారపడి జీవించే వాళ్లం. కానీ మనకు నచ్చిన చోట వీలైనంత తక్కువ ధరకు కొనుగోలు చేసుకుంటున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి: