
గోవాలో జరిగిన ఎస్ ఇ ఓ విదేశాంగ మంత్రుల సమావేశంలో భారతదేశ విదేశాంగ మంత్రి జై శంకర్ క్రాస్ బోర్డర్ టెర్రరిజంపై బలమైన సందేశం ఇచ్చారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దానీ, చైనా ప్రధాన మంత్రి ఫిన్ గ్యాంగ్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గేవ్ లావ్రో సమక్షంలో ఆయన మిగిలిన దేశాలకు ఉగ్రవాదంపై క్లాస్ తీసుకున్నారు. ప్రపంచం ఉగ్రవాదాన్ని సమర్థించదని మేము దృఢంగా విశ్వసిస్తున్నామని ఎస్.జై శంకర్ అన్నారు.
సరిహద్దు తీవ్రవాదంతో సహా అన్ని రూపాల్లో ఉన్న దానిని తక్షణమే అరికట్టాలి. ఉగ్రవాదం వైపు దృష్టి సారిస్తే అది మన భద్రతా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది. తీవ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేసే మార్గాలను ఎటువంటి తారతమ్యాలు లేకుండా, బేధాలు లేకుండా సీజ్ చేయాలి ఇంకా బ్లాక్ చేయాలి అని ఆయన మాట్లాడారని తెలుస్తుంది. తీవ్రవాదులు అనే ప్రస్థానం వచ్చేసరికి పెద్ద తీవ్రవాది, చిన్న తీవ్రవాది అంటూ ఉండరని, ఉండకూడదని, తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తుద ముట్టించాలని అంశాన్ని గుర్తు పెట్టుకోండి అంటూ చెప్పుకొచ్చారు ఆయన.
ఆర్థికంగా గాని, సహకార రీత్య గాని, మరొక రీత్యా గాని తీవ్రవాదాన్ని దగ్గరకు రానివ్వద్దు అన్న విషయాన్ని తేల్చి చెప్పారాయన. అయితే జైశంకర్ చెప్పినదానికి సరైన సమాధానం ఇవ్వలేని పాకిస్తానీ విదేశాంగ మంత్రి బిలావర్ బుట్టో ఆయన వ్యాఖ్యలపై మీడియాతో వ్యతిరేకంగా మాట్లాడడానికి సిద్ధమవుతున్నారు అన్నట్లుగా తెలుస్తుంది అని కొంతమంది అంటున్నారు. చూద్దాం ఆయన స్పీచ్ ఎంతవరకు ప్రభావితం చేస్తుందో.