
ముఖ్యంగా స్వచ్ఛమైన -0.55 డిగ్రీల వద్ద సెంట్రిగ్రేడ్ వద్ద గడ్డకడుతాయి. ఈ ఉష్ణోగ్రత మారిందంటే అందులో నీరు కలిసిందని అర్థం. సగటున లీటరు పాలకు 2 నుంచి 20 శాతం వరకు నీరు కలుపుతున్నారు. లాక్టోమీటర్ పరికరంలో పాలు పోయగానే అందులో కొవ్వు కాకుండా ఇతర ఘన పదార్థాలు ఎంత శాతం వరకు ఉన్నాయో తెలుస్తోంది. పాలను వేడి చేసినప్పుడు వచ్చే ఆవిరిలో ఏర్పడే ఘనపు రేణువులు స్పటికాల రూపంలో ఘనీభవిస్తే.. అందులో యూరియా కల్తీ చేసారని కనుక్కోవచ్చు. డిటర్జెంట్ పొడిని కలిపారేమో గుర్తించడానికి ఒక గ్లాస్‌లో 10.మి.లీ. పాలు, అంతే మొత్తంలో నీరు పోసి గిరాగిరా తిప్పి బాగా కలపాలి. డిటర్జెంట్ పొడి కలిపి ఉంటే పైన బాగా నురగ వస్తుంది. స్వచ్ఛమైన పాలు అయితే చాలా స్వల్పంగా నురగ వస్తుంది.
కొందరూ పాలు చిక్కగా కనిపించాలని పిండి పదార్థాలు, గంజిపొడి కలుపుతుంటారు. 2 నుంచి 3 మి.లీటర్ల పాలను ఒక చెంచాలో తీసుకొని..అంతే మోతాదులో నీళ్లు కలిపి మరగబెట్టి చల్లార్చాలి. అందులో 5 చుక్కలు టించర్ అయోడిన్ కలిపి చూస్తే.. పిండి పదార్థాలు కలిపి ఉంటే పాలునీలి రంగులోకి మారుతాయి. కల్తీ పాలు కాకపోతే తెల్లగానే ఉంటాయి. పాలలో యూరియాను గుర్తించడానికి సులభమైన పద్దతులున్నాయి. ఔషద దుకాణాల్లో యూరియాసే స్ట్రిప్స్ అమ్మతుంటారు. వాటిపై కొంచెంద పాలు పోయాలి. అందులో గీతలు కనిపిస్తే యూరియాతో తయారు చేసిన కృతిమ పాలు అని అర్థం. మరొక సింపుల్ చిట్కా ఏమిటంటే పాలను ఏదైనా ఒక చోట కింద లేదా అరచేతి వెనుక భాగంలో పోసి చూడగా.. మెల్లగా కదిలితే స్వచ్ఛమైన పాలు అని, వేగంగా కదిలితే నీళ్లు కలిపి నట్టు అని గుర్తుంచుకోవాలి. పాలను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం బెటర్ అని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. లేనియెడల అనారోగ్యం పాలు కావాల్సి వస్తోంది.