ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు దర్శకనిర్మాతలు. మన దర్శక నిర్మాతలు చేసే ప్రయత్నం అంతా ఇంతా కాదు.. ప్రేక్షకులను సరికొత్తగా ఎప్పటికప్పుడు మైమరపిస్తూ,ఎన్నో భిన్న విభిన్న కథలతో మన ముందుకు వస్తూ ఉంటారు. అయితే వాటిలో ఒకటి ముత్తు సినిమా కూడా. ఈ సినిమా వేదాంతం, వినోదం తో కలసి, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..


సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి పెద్దగా దీని ఇండస్ట్రీకి పరిచయం అవసరం లేదు. తన మ్యానరిజంతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటాడు. అంతేకాకుండా ఆయన చూపిన ప్రభావం ఇంకెవరు రిపీట్ చేయలేకపోతున్నారు అనేది వాస్తవం. డాన్స్ లో కొంత బలహీనంగా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్రెజెంటేషన్ వచ్చేటప్పటికి తనను అందుకోవడం మాత్రం కేవలం కొంతమంది స్టార్ హీరోలకు మాత్రమే దక్కింది. రజనీకాంత్ ను తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదటి గా పరిచయం చేసింది తమిళ్ డబ్బింగ్ మూవీస్ మాత్రమే. ఈ చిత్రాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.


తెలుగు ఇండస్ట్రీలో రజినీకాంత్ తీసిన బాషా సినిమా..ఆయన దశనే మార్చిందని చెప్పవచ్చు. ఇది సాధించిన ఘన విజయం తెలుగు ఇండస్ట్రీలో రజనీకాంత్ కు మరో ఐదు సంవత్సరాల పాటు తన స్థానాన్ని సుస్థిరం చేసింది. 1995 సంవత్సరంలో రజినీకాంత్ చేసిన బాషా బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత తను చేసిన రెండు చిత్రాలలో ఒకటి పెదరాయుడు, రెండోది హిందీలో ఆటంక్ హీ ఆటంక్, అయితే ఈ సినిమాలో అమీర్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ ఈ సినిమా పెద్దగా బాక్సాఫీస్ వద్ద ఆడలేదు. ఇక ఆ సమయంలో వచ్చిన సినిమానే ముత్తు.  ముత్తు సినిమాను కె.ఎస్.రవికుమార్ తెరకెక్కించాడు.మీనా హీరోయిన్ గా నటించింది.


1994లో మలయాళంలో వచ్చిన తేన్మావిన్ కొంబత్ ఆధారంగా ఒక కొత్త సబ్జెక్టును తయారు చేయమని రజినీకాంత్ కె.ఎస్.రవికుమార్ ను ప్రోత్సహించాడు. ఇక ఈ చిత్రంలో యజమాని తో పాటు పని వాడు కూడా ఒక అమ్మాయిని ప్రేమించే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం రజినీకాంత్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా కోసం అప్పట్లో ఐదు వేల మంది జూనియర్ ఆర్టిస్టులను తీసుకోవడం రికార్డు సృష్టించింది. అయితే అప్పటి దాకా మ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయరాజా, దేవా లను తప్ప, ఇంకెవరిని ఇష్టపడిన రజినీకాంత్ మొదటిసారి ఏ.ఆర్.రెహమాన్ కు అప్పగించాడు. ఏ.ఆర్.రెహమాన్ కూడా రజినీకాంత్ ను దృష్టిలో పెట్టుకొని సంగీతం అనువదించాడు. ఎవరూ ఊహించని రీతిలో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. ఇక ఇందులోని పాటలు ఇప్పటికీ లవర్స్ కు ఫేవరెట్ గానే నిలిచాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: