తెలుగు వారికే కాదు రెహమాన్ అంటే ప్రపంచవ్యాప్తంగా తెలియని వారు ఉండరు. భారత సంగీత ప్రపంచంలో ఆయన ఆయన ఎన్నో పాటలకు సంగీతం అందించారు..స్లం డాగ్ మిలియనీర్ లాంటి సినిమా మ్యూజిక్ అందించి భారత ప్రజలకు చిరకాల స్వప్నమైన అకాడమీ అవార్డును సైతం దక్కించుకుని తన పేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. చాలా కాలంగా ఆయన తనకు నచ్చిన అతికొద్ది సినిమాలకు మాత్రమే సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం మణిరత్నం పొన్నియన్ సెల్వన్ అనే సినిమాతో పాటు శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న మరో సినిమాకి మాత్రమే సంగీతం అందిస్తున్నాడు. 

అయితే ఆయన ప్రస్తుతం నిర్మాతగా మారి జియో స్టూడియోస్ తో కలిసి 99 సాంగ్స్ అనే పేరుతో ఒక సినిమాను నిర్మించాడు. సంగీతమే ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ ప్రేమకథను విశ్వేష్ కృష్ణమూర్తి తెరకెక్కించగా తెలుగు తమిళ హిందీ భాషలలో ఏప్రిల్ 16వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నిన్న హైదరాబాద్ వచ్చిన ఏ.ఆర్.రెహమాన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. 

ప్రెస్ మీట్ లో ఆయన వేసుకున్న షూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరూ ఇలాంటి షూస్ చూసి ఉండకపోవడమే. కింది షూస్ కింది భాగం అంతా గ్లాస్ తో కవర్ చేస్తున్న ఈ షూ ఇప్పటివరకు ఎవరూ వాడలేదు అని అంటున్నారు. మొట్టమొదటిసారి ఏ.ఆర్.రెహమాన్ కాళ్లకు కనిపించడంతో ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అసలు ఈ షూస్ బ్రాండ్ ఏంటి ?  వాటి ధర ఎంత అంటూ ఏ.ఆర్.రెహమాన్ షూస్ పేరిట సెర్చ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: