ఈరోజు రవితేజ హీరోగా నటించిన కిలాడి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రేక్షకుల్లో ఉన్న ఒకే ఒక ఆసక్తి ఏమిటంటే ఈ చిత్రంలో నటించిన ఇద్దరు హీరోయిన్లు ఏ స్థాయిలో నటించారు అన్నదే. గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరు హీరోయిన్లు కూడా హీరో కంటే ఎక్కువగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొని ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేశారు. అంతేకాదు ఈ ఇద్దరు కూడా గ్లామర్ చేయడంలో ఏమాత్రం తగ్గకుండా పోటీపడ్డారు. దాంతో ఎవరికీ ఈ సినిమాలో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి అని ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూడగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఈ ఇద్దరూ కూడా ఈ సినిమాకు సెట్ అయ్యారు అని వారు చెబుతున్నారు.

సుశాంత్ హీరోగా నటించిన ఇచట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యింది మీనాక్షి చౌదరి. తొలి సినిమాతో ఎంతో క్యూట్ గా సాంప్రదాయబద్ధంగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ రెండో సినిమాలో అంత గ్లామరస్ గా కనిపించడం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది అంతేకాదు ఈమె రవితేజకు లిప్ లాక్ ఇవ్వడం కూడా మరింత ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఆమె ఈ సినిమాలో ఇంకెంతటి గ్లామర్ పరిచిందని ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది.

ఇంకోవైపు హీరోయిన్ డింపుల్ హయాతి కూడా ఈ సినిమాలో భారీ స్థాయిలో గుర్తింపు వచ్చిందని తెలుస్తుంది. ఆమె తన అందాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. గద్దల కొండ గణేష్ సినిమా లోని ఐటమ్ సాంగ్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ మెటీరియల్ అని అప్పుడే అందరూ అనుకున్నారు కానీ ఆమెకు సరైన అవకాశం రాలేదు ఇప్పుడు ఆమె ఈ అవకాశాన్ని అందుకోగా ఈ చిత్రం తప్పకుండా ఆమెకు ప్లస్ అవుతుందని మొదటినుంచి భావించింది ఆమె భావించిన విధంగానే ఈ సినిమా ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఏదేమైనా ఈ ఇద్దరు ముద్దుగుమ్మ లు ఈ సినిమాకి ఎస్సెట్ అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: