టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో నిఖిల్ వరుస హిట్లు ఫ్లాఫ్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. హీరో నిఖిల్ స్వామి రారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు నిఖిల్. అందులో కార్తికేయ-2 సినిమా ఒకటీ. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. డైరెక్టర్ చందు మెండేటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కార్తికేయ సీక్వెల్గా వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే విడుదలైన సినిమా మోషన్ పోస్టర్లు ఎంతో అద్భుతమైన స్పందన లభిస్తోంది. సముద్రం దాచుకున్న అతి పెద్ద రహస్యం ఈ ద్వారక నగరం అంటూ హీరో నిఖిల్ ఒక వాయిస్ పోస్టర్  ఆసక్తి రేపుతోంది. ఇక కమర్షియల్ చిత్రాల తోపాటు విభిన్నమైన కథతో నిర్మాణాన్ని కొనసాగిస్తే విజయాలను సొంతం చేసుకుంటున్న నిర్మాణ సంస్థలలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా ఒకటి. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.


సినిమా టీజర్ జూన్ 24వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అందుకు సంబంధించి అధికారికంగా మేకర్స్ ఒక మోషన్ పోస్టర్ ద్వారా కూడా తెలియజేశారు. డాక్టర్ కార్తికేయ ప్రయాణం శ్రీకృష్ణుడు చరిత్ర లోకి ఎంటర్ అవుతున్నట్లు కనిపిస్తోంది . ఈ చిత్రంలో డైరెక్టర్ చందు మెండేటి ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ చిత్రం జూలై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇందులో శ్రీనివాస్ రెడ్డి, ఆదిత్య మీనన్, వైవా హర్ష, వెంకట్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం తో పాటుగా నిఖిల్ 18 పేజీస్, స్పై వంటి విభిన్నమైన చిత్రాలలో నటిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: