టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు ఆయన నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం ప్రారంభంలో బంగార్రాజు మూవీ తో మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్న నాగ చైతన్య ఆ తర్వాత విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థాంక్యూ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకో లేక పోయింది.

ఇది ఇలా ఉంటే నాగ చైతన్య ఈ సంవత్సరం ఆమీర్ ఖాన్ హీరోగా కరీనా కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన లాల్ సింగ్ చడ్డా అనే హిందీ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దూత అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అలాగే మరి కొన్ని రోజుల్లో తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో హీరోగా నటించ బోతున్నాడు.

మూవీ లో కృతి శెట్టి , నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించనుండగా , ఇళయరాజా , యువన శంకర్ రాజా ఈ మూవీ కి సంగీతాన్ని అందించబోతున్నారు. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య మరో టాలెంటెడ్ దర్శకుడు మూవీ లో నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. నీది నాది ఒకే కథ , విరాట పర్వం మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు ఉడుగుల దర్శకత్వంలో నాగ చైతన్య ఒక మూవీ లో నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: