150 సినిమాలకు పైగా నటించి నాలుగు దశాబ్దాలకు పైగా టాప్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న చిరంజీవిని ‘గాడ్ ఫాదర్’ మూవీ ఏవిధంగా భయపెట్టిందో చిరంజీవి ఎలాంటి మొహమాటం లేకుండా ఈమూవీ సక్సస్ మీట్ లో ఓపెన్ గా చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. ‘గాడ్ ఫాదర్’ విడుదల ముందురోజు రాత్రి తన భార్య సురేఖ చాల మౌనంగా ఉంటూ తనతో కూడ పెద్దగా మాట్లాడలేదని అంటూ ఒక ఆసక్తికర విషయాన్నీ తెలియచేసాడు.


తాను అలా ఎందుకు ఉన్నావు అంటూ అనేకసార్లు అడిగినా ఆమె సమాధానం చెప్పలేదని ఏమి మాట్లాడకపోవడంతో ఆమె కూడ తన ‘గాడ్ ఫాదర్’ మూవీ ఫలితం గురించి ఆలోచిస్తూ ఉందని తనకు అర్థం అయిందని చిరంజీవి కామెంట్ చేసాడు. పైకి తన భార్యతో తాను ధైర్యంగా మాట్లాడుతున్నప్పటికీ తెల్లవారి విడుదలకాబోయే ‘గాడ్ ఫాదర్’ టాక్ ఎలా వస్తుందో అంటూ తాను కూడ భయపడటంతో ఆరోజు రాత్రి తనకు కూడ సరిగ్గా నిద్రపట్టని విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు.


తన అంచనాలకు అనుగుణంగా ‘గాడ్ ఫాదర్’ మూవీకి హిట్ టాక్ వచ్చినప్పటికీ ఈసినిమా పై ఇంకా నెగిటివ్ ప్రచారం ఎందుకు జరుగుతోందో తనకు అర్థం కావడంలేదు అంటూ చిరంజీవి కామెంట్స్ చేసాడు. ప్రస్తుతతరం ప్రేక్షకుల అభిరుచి మారిపోవడంతో ఏసినిమా హిట్ అవుతుందో అనుభవం ఉన్నవాళ్ళకు కూడ తెలియని పరిస్థితి కొనసాగుతోంది అంటూ హిట్ అయిన ఒక సినిమాను నెగిటివ్ ప్రచారం చేసి ఆసినిమాకు హాని చేయవద్దు అంటూ మీడియా వర్గాలకు చిరంజీవి విజ్ఞప్తి చేసాడు.


చిరంజీవి మాటలను బట్టి ఫెయిల్యూర్ అన్న పదం ఒక సెలెబ్రెటీ నుండి సామాన్యుడి వరకు ఎలా భయపెడుతుందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ‘ఆచార్య’ మూవీపై చిరంజీవి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆసినిమాలో మెగా స్టార్ తన కొడుకు చరణ్ తో కలిసి నటించినప్పటికీ మెగా అభిమానులు కూడ పెద్దగా పట్టించుకోకపోవడం ఏకంగా చిరంజీవికే ఆశ్చర్యం కలిగింది అంటారు. ఏది ఎలా ఉన్నప్పటికీ చిరంజీవి మరిన్ని సినిమాలలో నటించే ఉత్సాహాన్ని ‘గాడ్ ఫాదర్’ కలిగించడంతో మరికొన్ని సినిమాలు చిరంజీవి ఉత్సాహంగా చేసే అవకాశం ఉంది..



మరింత సమాచారం తెలుసుకోండి: