టాలీవుడ్ దర్శకులలో
మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే దర్శకులలో ముందు వరుసలో ఉంటాడు హరీష్ శంకర్.
మిరపకాయ గబ్బర్ సింగ్
గద్దల కొండ గణేష్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు పవన్
కళ్యాణ్ తో తన రెండవ
సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే ఈ భవదీయుడు భగత్ సింగ్
సినిమా ప్రకటన జరిపి చాలా రోజులే అయిపోతున్న కూడా ఇప్పటివరకు
హరీష్ శంకర్ ఆ సినిమాను మొదలు పెట్టకపోవడం ఈ
సినిమా పట్ల ఎన్నో అనుమానాలను కలిగిస్తుంది.
అయితే గత కొన్ని రోజులుగా హరీష్ ఈ సినిమాను పక్కనపెట్టి
విజయ్ దేవరకొండ తో
సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ చాలామంది ఈ దర్శకుడు
విజయ్ దేవరకొండ తో
సినిమా చేస్తే చూడాలన్న కోరికను బయటకు చూపిస్తున్నారు. మరి వారి కోరిక నెరవేరుతుందా లేదా అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి చూడవలసిందే. హరీష్ ఒక మంచి కథను
విజయ్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా సిద్ధం చేసి ఆ తర్వాత ఆయనతో
సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లుగా చెబుతున్నారు.
ఇకపోతే
హరీష్ శంకర్ జాబితాలో ఇప్పుడు ఓ కొత్త
సినిమా చేరిందని చెప్పాలి. పలు సినిమాలకు స్క్రిప్టు పనులు చేసే
హరీష్ శంకర్ మానాడు
సినిమా రీమేక్ పనులను ఆయన చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
యువ హీరో సిద్దు జొన్నలగడ్డ
మాస్ రాజా
రవితేజ ఇద్దరూ ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్నారు. అయితే
హరీష్ శంకర్ దర్శకత్వంలో
శివ కార్తికేయన్ అలాగే
విజయ్ దేవరకొండ ఇద్దరు ఓ సినిమాలో నటించాలన్న కోరిక
ప్రిన్స్ ఆడియో వేడుకలో
శివ కార్తికేయన్ కొరవడంతో ఈ కాంబో సెట్ అవుతుందా అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది.