
గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న అలియా భట్ రణబీర్ కపూర్ ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. పెళ్లయిన రెండు నెలలకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన అలియా ఆ సమయంలో కూడా షూటింగ్స్ , ప్రమోషన్స్ లో పాల్గొంటూ చాలా యాక్టివ్ గా కనిపించింది . చివరిగా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మస్త్ర సినిమాలో కూడా నటించింది. ఇందులో ఆలియా రణబీర్ ఇద్దరు జంటగా నటించగా.. అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటించారు.
ఇకపోతే ఆలియా కూతురు కూడా తల్లిని మించిన అందంతో ఉందని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిన్నారి పాపను త్వరలోనే అందరికీ చూపిస్తామని కూడా స్పష్టం చేశారు కపూర్ ఫ్యామిలీ సభ్యులు. మొత్తానికైతే అలియా రణబీర్ కుటుంబంలోకి లక్ష్మీదేవి వచ్చిందని ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కపూర్ ఫ్యామిలీలో సంబరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.. ప్రస్తుతం ఆలియా అభిమానులు రణబీర్ అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.