మీరా జాస్మిన్ పేరు వినగానే రన్, పందెం కోడి, భద్ర వంటి హిట్ చిత్రాలు అయితే గుర్తొస్తాయి. ఆ చిత్రాల్లో ఆమె చేసిన రోల్స్ ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుండి పోతాయి.

ముఖ్యంగా పందెం కోడి మూవీలో అల్లరి పిల్లగా మీరా జాస్మిన్ నటన అద్భుతం. రవితేజ భద్ర మూవీలో ఆమె పాత్ర చాలా డీసెంట్ గా ఉంటుంది. హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న మీరా జాస్మిన్ ఏనాడూ స్కిన్ షో చేయలేదు. మంచి నటిగా గుర్తింపు రావడంతో నటనకు స్కోప్ ఉన్న చిత్రాల్లో మీరా జాస్మిన్ కి ఆఫర్స్ దక్కేవి. అలాంటి మీరా జాస్మిన్ స్కిన్ షో చేస్తారని ఎవరూ ఊహించలేదుట.


కానీ నాలుగు పదుల వయసులో మీరా జాస్మిన్ స్కిన్ షోకి తెరలేపింది. ఆమె ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ కాకరేపుతున్నాయి. అందాలు ఎరవేస్తూ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కెరీర్ పూర్తిగా డల్ అయిన నేపథ్యంలో మీరా ఊహించని మార్గం ఎంచుకున్నారు. ఒకప్పుడు స్టార్ గా సౌత్ ఇండియాను ఊపేసిన మీరా జాస్మిన్ ఇంస్టాగ్రామ్ మీద ఆధారపడటం అనుకోని సంఘటన.

కెరీర్ పీక్స్ లో ఉండగా మీరా జాస్మిన్ బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ తో జతకట్టారు. పవన్ కళ్యాణ్ కి జంటగా గుడుంబా శంకర్ మూవీలో మీరా జాస్మిన్ నటించారు. ఇక బాలయ్యతో మహారథి చిత్రం చేశారు. ఈ రెండు చిత్రాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. 2014లో వివాహం చేసుకునే వరకు మీరా అడపాదడపా చిత్రాలు చేస్తూనే ఉన్నారు. పెళ్లి తర్వాత ఆమె అనేక వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది.

అనిల్ జాన్ టైటస్ అనే వ్యక్తిని మీరా జాస్మిన్ పెళ్లి చేసుకున్నారు. అనిల్ దుబాయ్ లో ఇంజనీర్.పెళ్లయ్యాక అనిల్ తో పాటు అక్కడకు వెళ్లిపోయారు. అతనితో మీరా జాస్మిన్ కి విభేదాలు తలెత్తాయనే వాదన కూడా ఉంది. వీరిద్దరూ ప్రస్తుతం వేరు వేరుగా ఉంటున్నారట. హీరోయిన్ గా తాను సంపాదించిన ఆస్తి కుటుంబ సభ్యుల అధీనంలో ఉందట. దాని కోసం ఇటీవల న్యాయపోరాటం మొదలుపెట్టారంటూ వార్తలు వస్తున్నాయి. నటిగా రాణించిన మీరా వ్యక్తిగత జీవితం సరిగా ప్లాన్ చేసుకోలేదుట.అందుకే ఆమె అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మీరా జాస్మిన్ ఎంత వరకు సక్సెస్ అవుతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: