
ప్రస్తుతం తెలుగు, మలయాళం లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను హిందీలో అజయ్ దేవగన్, శ్రేయ కలిసి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఊహించని విధంగా హిందీ దృశ్యం 2 సినిమాను థియేటర్లలో విడుదల చేయగా ఊహించని రేంజ్ లో ఈ సినిమాకి రెస్పాన్స్ పొందుతోంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత అటు వెంకటేష్ , ఇటు మోహన్ లాల్ ఇద్దరూ కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. థియేటర్లలో విడుదల చేయకుండా ఓటీటీ లలో విడుదల చేసి ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయామని మనస్థాపం చెందుతున్నారు.
హిందీలో అభిషేక పతాక దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 18 వ తేదీన థియేటర్లలో విడుదల చేయగా.. మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా.. ఇందులో హీరోగా అజయ్ దేవగన్ , టబు, అక్షయ కన్నా, శ్రేయ శరణ్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న కలెక్షన్ ల తుఫాన్ ను చూసి అటు మోహన్ లాల్ ఇటు వెంకటేష్ ఇద్దరూ నిరాశ వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.