నితిన్ కు ఇప్పుడు అర్జెంట్ గా ఒక హిట్ కావాలి. లేదంటే ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోల మధ్య కొనసాగుతున్న నెక్ టు నెక్ కాంపిటేషన్ లో నితిన్ నిలబడటం కష్టం అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఇతడు ధైర్యం చేసి వక్కంతం వంశీ దర్శకత్వంలో నటిస్తున్న మూవీకి సంబంధించిన వార్తలను విన్నవారికి అల్లు అర్జున్ ‘పుష్ప’ గుర్తుకు వస్తోంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.తెలుస్తున్న సమాచారంమేరకు ఈమూవీకి సంబంధించిన షూటింగ్ ఈమధ్యనే తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఈమూవీలో నితిన్ స్మగ్లర్ పాత్రలో రఫ్ గా గడ్డంతో నితిన్ లారీ డ్రైవర్ గా కనిపిస్తాడట. ఈపాత్ర వివరణ విన్నవారికి వెంటనే అల్లు అర్జున్ ‘పుష్ప’ గుర్తుకు వస్తుంది. వక్కంతం వంశీ మంచి రచయిత అయినప్పటికీ అతడు తీసిన సినిమాలలో గత సినిమాల జ్ఞాపకాలు ఉంటాయని అపవాదు ఉంది.‘కిక్’ సినిమా చూసిన వారికి ‘జెంటిల్ మెన్’ ‘నాపేరు సూర్య’ సినిమా చూసిన వారికి ‘వజ్రం’ సినిమాలు గుర్తుకు వచ్చాయి. దీనితో ఇప్పుడు ఇతడు బన్నీ తో తీయబోతున్న సినిమాను చూసినవారికి ‘పుష్ప’ గుర్తుకు వస్తుందా అంటూ మరికొందరు ఆశ్చర్య పోతున్నారు. ఈసినిమాకు సంబంధించిన మారేడుమిల్లి షూటింగ్ పూర్తి చేసుకుని తరువాత ఈ యూనిట్ సభ్యులు హైదరాబాద్ కు షిఫ్ట్ అయి రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేస్తారని అంటున్నారు.‘జయం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్ ఇండస్ట్రీలోకి వచ్చి 20 సంవత్సరాలు దాటిపోయినా నితిన్ ఇంకా మీడియం రేంజ్ హీరోగానే కొనసాగుతున్నాడు. అతడికి ఒక హిట్ వచ్చిందంటే వెంటనే వరసగా ఫ్లాప్ లు వస్తున్నాయి. దీనితో అతడి మార్కెట్ పెరగడం లేదు అన్నఅభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుత తరం ప్రేక్షకులు ఒక సినిమాను చూస్తే చాలు. ఆ సినిమా ఫలానా సినిమాకు కాపీ అంటూ కామెంట్స్ మొదలు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో నితిన్ చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకు సక్సస్ అవుతుందో చూడాలి..
మరింత సమాచారం తెలుసుకోండి: