తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న అజిత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అజిత్ కొంత కాలం క్రితమే వలినై అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. హెచ్ వినోద్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ ని బోనీ కపూర్ నిర్మించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అజిత్ తునివు అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. హెచ్ వినోద్ దర్శకత్వం లో తేరకేకుతున్న ఈ మూవీ ని కూడా బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని జనవరి 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లో రాబోతుంది. 

మూవీ ని తెలుగు లో కూడా భారీ ఎత్తున విడుదల చేయడానికి ఈ మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా యూనిట్ ఈ మూవీ యొక్క ప్రమోషన్ లను మొదలు పెట్టింది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీసినిమా నుండి "చిల్ల చిల్ల" అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసింది. ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి ప్రస్తుతం సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ కి జీబ్రాన్ సంగీతం అందించాడు. తాజాగా మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ సాంగ్ కు జీబ్రాన్ సంగీతం అందించగా , అనిరుద్ రవిచంద్రన్ ఈ పాటను పాడాడు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. తమిళ సినీ ప్రేమికులు తునివు మూవీ పైభారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: