
ఇందుకు ప్రత్యామ్నాయంగా మరో వేదికను ఎంచుకోవాలని నిర్వాహకులకు పోలీసులు సూచించగా ఈ ఈవెంట్ వేదికను విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. అంతేకాదు హైదరాబాదు నుంచి అభిమానుల కోసం ప్రత్యేకంగా ఒక రైలును కూడా బుక్ చేశారు.ఇటీవల ఏపీ ప్రభుత్వం రోడ్లలో, ప్రధాన కూడళ్లలో సభలు, ర్యాలీలు నిర్వహించకుండా జీవో నెంబర్ వన్ జారీ చేసింది ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు పోలీసులు అనుమతించలేదు. కానీ ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ ను ఎంపిక చేయడం అక్కడ నిర్వహణకు పోలీసులు కూడా అనుమతి ఇవ్వడంతో చిత్ర నిర్మాతలు ఏర్పాట్లలో నిమగ్నం అయిపోయారు.
ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా హాజరు కాబోతుండడంతో పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉందని సమాచారం. అంతేకాదు ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై సినిమా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరసింహారెడ్డి సినిమా నుంచి ట్రైలర్ విడుదలయ్యింది. మరి వాల్తేరు వీరయ్య ట్రైలర్ ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.