నందమూరి బాలకృష్ణ తాజాగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వీర సింహా రెడ్డి లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా , దునియా విజయ్ ... వరలక్ష్మి శరత్ కుమార్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా  మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు.

హనీ రోజ్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల అయ్యి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటివరకు 25 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 25 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

25 రోజుల్లో ఈ మూవీ నైజాం ఏరియాలో 17.31 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా , సీడెడ్ లో 16.50 కోట్లు , యు ఏ లో 8.55 కోట్లు , ఈస్ట్ లో 6.60 కోట్లు , వెస్ట్ లో 4.90 కోట్లు , గుంటూరు లో 7.42 కోట్లు , కృష్ణ లో 4.73 కోట్లు ,  నెల్లూరు లో 3 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 రోజుల్లో 69.01 కోట్ల షేర్ , 112.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీ కి 4.85 కోట్లు , ఓవర్సీస్ లో 5.77 కోట్ల కలెక్షన్ లు దక్కయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 25 రోజుల్లో ఈ మూవీ కి 79.63 కోట్ల షేర్ , 133.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు లభించాయి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: