
ఇక ఇలా జబర్దస్త్ పై సంచలన విమర్శలు చేసిన వారిలో కిర్రాక్ ఆర్పి కూడా ఒకరు అని చెప్పాలి. చమక్ చంద్ర టీం లో కంటెస్టెంట్ గా జబర్దస్త్ లోకి ఎంటర్ ఇచ్చి ఆ తర్వాత టీం లీడర్ గా మారి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత జబర్దస్త్ నుంచి పక్కకు తప్పుకున్నాడు. ఇక మిగతా షో లలో సందడి చేశాడు. అయితే ఇక ఇటీవలే అన్ని బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉండి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. తక్కువ సమయంలోనే ఈ రెస్టారెంట్ మంచి గుర్తింపు సంపాదించుకుంది.
అయితే ఇక జబర్దస్త్ లో టీం లీడర్ గా కొనసాగుతున్న రాకింగ్ రాకేష్ ఇక కిర్రాక్ ఆర్పి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు రాకింగ్ రాకేష్. ఈ సందర్భంగా ఆర్పి గురించి ప్రశ్న ఎదురు కాగా.. ఆర్పి కి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ జబర్దస్త్ పెట్టిన భిక్ష అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మధ్యకాలంలో ఆర్పిని ఎప్పుడైనా కలిశారా అంటూ ప్రశ్నిస్తే అంత పెద్ద వాళ్ళని కలిసే అదృష్టం తనకు ఇంకా రాలేదు.. మేమేదో చిన్న చిన్న ఆర్టిస్టులం అంటూ ఆర్పి పై రాకేష్ పరోక్షంగా కామెంట్లు చేశాడు..