
కాగా స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శరత్ కుమార్ ఇటీవల తన నట వారసురాలు అయిన వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం తన కూతురు వరలక్ష్మి నటనను విజయశాంతితో పోలుస్తున్నారని చెప్పుకొచ్చాడు. వరలక్ష్మి సినిమాల్లోకి వస్తానని చెబితే ఎంఏ చదివిన నువ్వు సినిమాల్లోకి రావడం అవసరం లేదని చెప్పాను అంటూ శరత్ కుమార్ అన్నాడు. అయితే వరలక్ష్మీ మాత్రం సినిమాల్లో నటిగా కెరియర్ను కొనసాగించాలని ఆశపడింది. చివరికి ఇక ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగిందని శరత్ కుమార్ చెప్పుకొచ్చాడు.
అయితే తన కూతురు వరలక్ష్మికి బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఇక సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఓన్ టాలెంట్ తోనే ఎదిగిందని చెప్పుకొచ్చారు. అయితే ఆమె బోల్డ్ అండ్ బ్రేవ్ వుమెన్ అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక ఓ రోజు రాత్రి తనని ఏడిపించిన ఇద్దరు వ్యక్తులను దారుణంగా చితక బాధింది అన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు శరత్ కుమార్. దీన్నిబట్టి ఆమె ఎంత ధైర్యశాలో అర్థం చేసుకున్నాను అంటూ చెప్పుకోచ్చాడు. వరలక్ష్మికి తండ్రి అయినందుకు ఎంతో గౌరవంగా ఫీల్ అవుతున్నాను అంటూ తెలిపారు. కాగా ప్రస్తుతం ఇండస్ట్రీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలకు వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్టర్లకు మొదటి ఆప్షన్ గా మారిపోయింది అని చెప్పాలి.