తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి టాలెంట్ ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఒకరు అయినటు వంటి సమంత గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత ఏం మాయ చేసావే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. నాగ చైతన్య హీరో గా నటించిన ఈ మూవీ కి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ మంచి విజయం సాధించడం అలాగే ఈ సినిమాలో సమంత తన అంద చందాలతో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ ముద్దుగుమ్మకు వరుస సినిమా అవకాశాలు దక్కాయి.

అందులో భాగంగా ఎక్కువ శాతం సమంత నటించిన మూవీ లు కూడా విజయాలను సాధించడంతో ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. అలాగే ఇప్పటికి కూడా సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న సమంత సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అనేక విషయాలను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

అందులో భాగంగా తాజాగా సోషల్ మీడియా వేదికగా సమంత ఒక పోస్ట్ చేసింది... తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా ... పూజ చేస్తున్న  ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘‘కొన్నిటిని ఎదుర్కోవడానికి  బలం సరిపోదు. మనపై మనకున్న నమ్మకం ముందుకు మనల్ని తీసుకువెళ్తుంది. అలాగే మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ఆ నమ్మకమే స్నేహితుడిగా , గురువుల మారుతుంది. అది మనల్ని మానవాతీత శక్తిగా నిలబెడుతుంది అని సమంత తాజాగా రాసుకొచ్చింది. సమంత చేసిన ఈ పోస్ట్ పై అనుష్క శర్మ స్పందించింది. నేను దీనిని పూర్తిగా అంగీకరిస్తున్నాను అంటూ సమంత పోస్ట్ కి ఓ హార్ట్‌ ఎమోజీని కూడా అనుష్క షేర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: