
రవితేజ ఇద్దరు సోదరులు ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ ఇద్దరు ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారు. ఇందులో ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. కానీ రవితేజ మాత్రం ఎలాంటి ఆరోపణలకు ఇప్పటివరకు తావు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు సంచలనం రేపే విధంగా..ఉమైర్ సంధు ట్విట్ చేయడం జరుగుతోంది. సూపర్ స్టార్ రవితేజ తో పని చేయడానికి ఎంతోమంది హీరోయిన్లు ఐటెం గర్ల్స్ పలు రకాలుగా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారని ఆరోపిస్తున్నారు సినిమా షూటింగ్ సమయంలో ఆయన వారి శరీరాలను పట్టుకొని విధానం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని వారు భావిస్తున్నారని కామెంట్లు చేశారు.
రవితేజ ప్రతి సినిమాలో కూడా కొత్త నటీమణులను ఇబ్బంది పెడుతుంటారని తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు ఉమైర్ సంధు. దీంతో రవితేజ అభిమానులు మరొకసారి ఈయన పైన విరుచుకుపడుతూ పలు రకాలుగా కామెంట్స్ చేయడం జరుగుతోంది. అసలు ఈ ఉమైర్ సంధు అనే వ్యక్తి ఉన్నారా లేకపోతే సోషల్ మీడియాలో ఒక కల్పిత అకౌంట్ అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు అయితే ఇప్పటివరకు ఈ విషయంపై క్లారిటీనే రాలేదు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.