కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, సుదీప్ కాంబినేషన్లో వచ్చిన క్రేజీ మల్టీస్టారర్ చిత్రం కబ్జ. ఈ సినిమా పునీత్ రాజ్కుమార్ జయంతి సందర్భంగా మార్చి 17వ తేదీన తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ వంటి భాషలలో వరల్డ్ వైడ్ గా చాలా గ్రాండ్గా విడుదల చేయడం జరిగింది. టీజర్ ట్రైలర్ వంటివి కేజిఎఫ్ సినిమాను హోలీ ఉండడంతో మాస్ ఆడియన్స్ తో పాటు ఉపేంద్ర అభిమానులు కూడా కొద్దిపాటి అంచనాలు నెలకొన్నాయి. అలాగే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఈ చిత్రంలో ఒక స్పెషల్ పాత్రలో కనిపించడం గమనార్హం. ఇందులో హీరోయిన్గా శ్రీయ నటించింది.


డైరెక్టర్ ఆర్ చంద్రు దర్శకత్వం వహించారు . మొదటి రోజు ఈ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం తోపాటు తెలుగులో కూడా ఈ చిత్రానికి ఎక్కువ రేట్లు పెంచలేదు కాబట్టి ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది.కలెక్షన్ల పరంగా అయితే మొదటి రోజు కబ్జ ఫస్ట్ డే కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

1). నైజాం- రూ .18 లక్షలు
2). సి డెడ్- రూ.9 లక్షలు
3). ఆంధ్ర ప్రదేశ్- రూ.17 లక్షలు
4). ఆంధ్రప్రదేశ్ + తెలంగాణ మొత్తం కలుపుకొని.. రూ.44 లక్షల రూపాయలు.
5). రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ .. రూ. లక్ష రూపాయలు
6). ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్లు రూ.45 లక్షలు

కబ్జా సినిమా దాదాపుగా రూ. కోటి రూపాయల థియేటర్ తెలుగు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే కచ్చితంగా రూ.1.2 కోట్ల రూపాయలను రాబట్టాల్సి ఉంది.అయితే మొదటి రోజు నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ కబ్జ సినిమా కొన్ని మాస్ ఏరియాలలో బాగానే కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. దీంతో మొదటి రోజే రూ .45 లక్షలకు పైగా షేర్ రాబట్టినట్లు సమాచారం అంటే కేవలం రూ .75 లక్షల రూపాయలను రాబట్టాల్సి ఉన్నది. ఇక రెండవ రోజు వర్షాల వల్ల  థియేటర్లకు వెళ్లే పరిస్థితి కనిపించలేదు మరి ఈ సినిమా వీకెండ్ వల్ల బయటపడుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: