దక్షిణాది ప్రేక్షకులను ఉర్రూతలు ఊగించిన హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. ఇక ఈమె తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును 2020 వివాహం చేసుకుంది ఇక గత ఏడాది ఏప్రిల్ 19న మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అలా ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉండడం జరిగింది.ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధంగానే ఉంది. కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్-2 చిత్రంలో కూడా నటిస్తూనే మరొకవైపు తమిళ సినిమాలలో నటిస్తూ ఉన్నది. అలాగే బాలకృష్ణ సినిమాలో కూడా హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు సమాచారం.
కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్  మొదలుపెట్టేందుకు గ్లామర్ వలకబోస్తూ పలు ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంది. ప్రస్తుతం కాజల్ నటించిన ఘోస్టి సినిమా ప్రమోషన్ లో భాగంగా తెగ సందడి చేస్తోంది కాజల్. అప్పటికి ఇప్పటికి చెక్కుచెదరని అందంతో అదిరిపోయే ఔట్ ఫిట్లో స్టన్నింగ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈమె అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాజల్ అగర్వాల్ కం బ్యాక్ ఇస్తూ పలు ఫోటోలను నెట్టింట వైరల్ గా మారేలా చేస్తోంది. ఈమె ఫోటో షూట్లకు కుర్రకారు సైతం మైండ్ బ్లాక్ అయ్యేవిధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ఘోస్టీ సినిమాలో కాజల్ అగర్వాల్ తో పాటు సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి కళ్యాణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే విధంగా పలు ప్రయత్నాలు చేస్తుంది కాజల్ అగర్వాల్. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో కాజల్ అగర్వాల్ ఫోటోషూట్లు మరింత వైరల్ గా మారుతున్నాయి. కాజల్ అగర్వాల్ ఎక్కువ సమయాన్ని తన కుమారుడికి కేటాయిస్తూ ఉంటుంది. ఈ అమ్మడు పూర్వపు ఫిట్నెస్ కోసం పలు రకాలుగా జిమ్ లో కసరత్తులను.. వర్క్ అవుట్లను సైతం చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం కాజల్ సిట్టింగ్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: