కోలీవుడ్ స్టార్ హీరో గత యేడాది తునివు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయింది. ఇదంతా ఇలా ఉండగా ఏడాది మరొక రెండు సినిమాలతో అజిత్ ప్రేక్షకులను అలరించనున్నారు. కానీ కొద్దిరోజులుగా కోలీవుడ్ సర్కిల్లో ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే తన భార్యతో విడిపోతున్నట్లుగా వార్తలు వినిపించాయి. అయితే సోషల్ మీడియాలో తరచుగా ఈ హీరో మీద ఇలాంటి ప్రచారం జరుగుతూ ఉండడంతో ఈ నేపథ్యంతో అజిత్ మీద కూడా విస్తృతంగా ఈ ప్రచారం వినిపించింది.


తాజాగా అజిత్ ఒక ఫోటోతో తనపై జరుగుతున్న ఇలాంటి ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టాడని చెప్పవచ్చు.  అజిత్ తన భార్య షాలినితో వెకేషన్ కి వెళ్ళినట్లు తెలుస్తోంది.  అక్కడ ఇద్దరు కలిసి బోటు షికారు చేస్తున్నటువంటి కొన్ని ఫోటోలు షేర్ చేయడం జరిగింది.  ఈ ఫోటోల ద్వారా తామిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్.. విడిపోయే ప్రసక్తి లేదని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది.  ఈ ఫోటోలతో ఇన్ని రోజులు జరుగుతున్న నెగిటివ్ ప్రచారానికి పుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు. ఇదంతా ఇలా ఉంటే అజిత్ హీరోగా ఈ రేంజ్ లో ఉన్నా కూడా ఎక్కువగా అడ్వెంచర్ మూవీలు చేయడానికి ఇష్టపడుతున్నారు.


అలాగే షూటింగ్లోకి వచ్చి బైక్ మీద తిరిగి వెళుతూ ఉంటారు అజిత్.. అజిత్ ఎక్కువగా ఫ్లైట్స్ మీద కంటే బైక్స్ మీదే రైడింగ్ చేస్తూ ఉంటారు.  అలాగే రేసర్గా కూడా ఇతనికి మంచి గుర్తింపు ఉందని చెప్పవచ్చు.  ఇంటర్నేషనల్ లెవెల్ బైక్ కార్ రేసింగ్ లలో కూడా పాల్గొంటూ ఉంటారు అజిత్. అజిత తన 62వ సినిమా షూటింగ్లో త్వరలోనే పాల్గొనబోతున్నారు. మరి ఈ మేరకు అజిత్, షాలిని పైన వస్తున్న రూమర్లకు చెక్ పెట్టడంతో ఇకమీదట ఈ రూమర్లు ఆగిపోతాయేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: