టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నరేష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఉగ్రమ్. ఇక ఈ సినిమా ఈ ఏడాది ఎండాకాలంలో విడుదల కానుంది. ఇంతలోనే ఈ అల్లరి హీరో తన తరువాత సినిమాని ప్రకటించాడు.ఫస్ట్ టైం మల్లి అంకంతో సినిమా చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇక ఈ సినిమా ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా అలరించబోతుందట. చాలా కాలం తర్వాత నరేష్ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కనిపిస్తున్నాడని తెలియడంతో ఆయన ఫ్యాన్స్ ఇంకా నరేష్ ని ఇష్టపడేవారు చాలా హ్యాపీగా ఉన్నారు.కితకితలు,బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్, బ్లేడ్ బాబ్జి, బెండ్ అప్పారావ్ ఆర్ఎంపి, దొంగల బండి వంటి సినిమాలు  తెలుగు ప్రేక్షకులను ఎంతగానో కడుపుబ్బా నవ్వించాయి. అలాంటి సినిమాలు ఇంకా తన నుంచి మరిన్ని రావాలని ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చూస్తున్నారు. ఫైనల్ గా ఇప్పుడు ఆ కోరిక తీర్చడానికి అల్లరి నరేష్ రెడీ అవ్వడంతో ఆయన అభిమానులు తెగ సంతోషపడుతున్నారు.ఇంకా టైటిల్ కూడా కన్ఫర్మ్ చేయని ఈ సినిమాలో నరేష్ సరసన హీరోయిన్‌గా ఫరియా అబ్దుల్లాను ఫైనల్ చేశారు.


ఫరియా జాతి రత్నాలు సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాతోనే ఈ బ్యూటీ మంచి కామెడీ టైమింగ్‌తో బాగా నవ్వించింది. అలాగే తన సొట్ట బుగ్గల తో యూత్ గుండెల్లో గిలిగింతలు పెట్టింది. మొత్తం మీద నరేష్, ఫరియాల కాంబినేషన్ స్క్రీన్ పై ఖచ్చితంగా నవ్వులు పూయించనుందని సమాచారం తెలుస్తోంది. అయితే ఇది రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కాదని సమాచారం. మల్లి వైవిధ్యమైన కథను రెడీ చేసినట్లు సమాచారం తెలుస్తుంది.చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నారు. మలయాళం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు. అలాగే సూర్య సినిమాటోగ్రఫీ చూసుకుంటారు. అత్యంత శుభప్రదమైన ఉగాది పండుగ సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు మేకర్స్.ఇంకా అంతేకాదు ఈరోజు ఓపెనింగ్ పూజా ముహూర్తం కూడా నిర్వహించారు. త్వరలోనే ప్రొడక్షన్ పనులు ప్రారంభించేందుకు టీం వారు ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: