
ఆమూవీ సూపర్ సక్సస్ తరువాత ఎన్నో ఆఫర్లు జోన్నలగడ్డకు వచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకుండా సిద్దూ తన దృష్టిని అంతా ‘టిల్లు స్క్వేర్’ పై పెట్టాడు. ఈమూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈమూవీని ఏకంగా చిరంజీవి ‘భోళాశంకర్’ మూవీతో పోటీ పడుతూ విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ వస్తున్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి.
త్వరలో రాబోతున్న ఆగష్టు 11 రిలీజ్ డేట్ పై విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. స్వాతంత్ర దిదినోత్సవంతో కలిసి వస్తున్న లాంగ్ వీకెండ్ కావడంతో భారీ సినిమాలు అన్నీ అదే రిలీజ్ డేట్ ను టార్గెట్ చేస్తూ విడుదల అవుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి ‘భోళా శంకర్’ ఆగష్టు 11న విడుదల అవుతున్నట్లుగా ప్రకటించారు.
ఇక రజనీకాంత్ ‘జైలర్’ మూవీ సందీప్ వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ నటిస్తున్న యానిమల్ మూవీ కూడ అదే డేట్ న రాబోతున్నాయి. దీనితో ఇన్ని భారీ సినిమాలకు ధియేటర్లు ఎక్కడ దొరుకుతాయి అన్న సందేహం చాలామందిలో ఉంది. ఇలాంటి భారీ సినిమాల మధ్య నిజంగా సిద్దూ జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ విడుదల చేయడానికి సాహసిస్తారా ఒకవేళ సాహసించినా సిద్దూకి ధియేటర్లు ఎక్కడ దొరుకుతాయి అంటూ ఇది అంతా జొన్నలగడ్డ అనుససరిస్తున్న మార్కెటింగ్ వ్యూహం అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఇదే రిలీజ్ డేట్ కు మహేష్ త్రివిక్రమ్ ల మూవీ కూడ రావాలని ప్రయత్నించింది. అయితే ఈమూవీ షూటింగ్ మొదలు పెట్టడం ఆలస్యం అవ్వడంతో ఈ రేస్ నుండి మహేష్ తప్పుకుని సంక్రాంతి వైపు అడుగులు వేస్తున్నాడు.. .