ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో శివ కార్తికేయన్ ఒకరు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి వాటిలో అనేక మూవీ లతో అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకని కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ నటుడు నటించిన కొన్ని సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేశారు. అందులో వరుణ్ డాక్టర్ ... కాలేజ్ డాన్ సినిమాలు వరసగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఈ రెండు మూవీ ల విజయాలతో శివ కార్తికేయన్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా క్రేజ్ విపరీతంగా పెరిగి పోయింది. 

ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ హీరో జాతి రత్నాలు మూవీ దర్శకుడు అయినటువంటి అనుదీప్ కే వి దర్శకత్వంలో రూపొందిన ప్రిన్స్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల అయ్యి పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో మా వీరన్ అనే తమిళ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని తెలుగు లో మహా వీరుడు అనే పేరుతో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఆగస్టు 11 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు తాజాగా ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రక టించింది. ఈ సినిమాకు అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ దర్శకుడు ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిస్తున్నాడు. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: