తెలుగు ఇండస్ట్రీ లో కొత్త హీరోయిన్ల హవా అయితే కొనసాగుతుంది. ముఖ్యం గా తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సంయుక్త మీనన్. ఇప్పుడు ఈ అమ్మడు గోల్డెన్ బ్యూటీ గా అయితే క్రేజ్ సంపాదించుకుంది.

భీమ్లానాయక్, బింబిసార, సార్ మరియు విరూపాక్ష లతో వరుస హిట్స్ అందుకుని ఫుల్ జోష్ మీదుంది సంయుక్త. ఇప్పుడు తనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. అందంతోపాటు.. అభినయం తో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ కు మరిన్న ఆఫర్స్ అయితే క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు విరూపాక్ష సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. డైరెక్టర్ కార్తీక్ దండు కాంబోలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా .. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు ను రాబడుతుంది. ఇందులో సంయుక్త నటనకు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. తాజాగా ఈ బ్యూటీకి మరో భారీ ఆఫర్ వచ్చినట్లు గా సమాచారం.

అదెంటంటే.. లేటేస్ట్ సమాచారం ప్రకారం సంయుక్త నెక్ట్స్ ప్రాజెక్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‏తో ఉండబోతుందని తెలుస్తుంది.ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీ గా ఉన్న బన్నీ.. ఆ తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారట. ప్రస్తుతం మహేష్ బాబుతో మూవీ చేస్తున్న త్రివిక్రమ్మూవీ తర్వాత బన్నీతో చేయనున్నారట. ఇందులో బన్నీ జోడి గా సంయుక్త నటించనుందని సమాచారం.ఇప్పటికే ఈ ముద్దుగుమ్మకు చిత్రయూనిట్ సంప్రదించగా.. ఓకే చేసినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం మహేష్ బాబు ప్రధాన పాత్రలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారట త్రివిక్రమ్. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. శ్రీలీల కీలకపాత్రలో కనిపించనుందని తెలుస్తుంది.. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా అయితే జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ అంచనాలను బాగా పెంచేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: