
ఇందులో హీరోయిన్గా నయనతార నటించాక విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తూ ఉన్నారు.ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తోని తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం జవాన్ సినిమాకు సంబంధించి వరుస అప్డేట్లను ఇస్తూ వస్తోంది చిత్ర బృందం. ఈ సినిమాతో మరొకసారి షారుక్ తన యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ సినీ ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొదట ఈ సినిమా జూన్ 2వ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం అనుకోగా కొన్ని కారణాల చేత ఈ సినిమాని వాయిదా వేయవలసి వచ్చింది.
సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. అలాగే హీరోయిన్ దీపికా పదుకొనే ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా హక్కులను హిందీ ,తమిళ్, తెలుగు భాషలలో ఎస్ రాజ్ ఫీలింగ్స్ చేజిక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను కూడా భారీ ధరకే అమ్ముడుపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈసారి షారుక్ ఖాన్ ఏ విధంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారా తెలియాలి అంటే సెప్టెంబర్ 7 వరకు ఆగాల్సిందే.