టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రముఖ నటుడు సాయికుమార్ కుమారుడైన ఆది తండ్రికి తగ్గ పేరు తెచ్చుకోలేకపోతున్నాడని చెప్పాలి. ఇప్పటికీ చాలా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా సరైన టాక్ అనేది సొంతం చేసుకోలేకపోతున్నాడు. నటనపరంగా మంచి టాలెంట్ ఉన్నా కూడా ఎందుకో ముందు లిస్టులోకి రాలేకపోతున్నాడు.

మొదట్లో నటించిన ప్రేమకావాలి, లవ్ లీ, సుకుమారుడు వంటి సినిమాలలో నటించి కొంత సక్సెస్ అందుకోగా .. ఆ తర్వాత వచ్చిన సినిమాలో అంత సక్సెస్ కాలేకపోయాడు. అయినప్పటికీ కూడా దర్శకనిర్మాతలు ఈయనకు నమ్మకంతోని అవకాశాలు ఇస్తున్నారని చెప్పాలి. అలా ఆ మధ్యనే వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇక ఈ ఏడాది మూడు నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఇదంతా పక్కన పెడితే.. ఈయన నటించిన టాప్ గేర్ సినిమా గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో శశికాంత్ నూతన దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే అనుభవమున్న దర్శకుడిగా పని చేశాడు. ఇక ఇందులో ఆది సరసన రియా సుమన్ హీరోయిన్ గా నటించింది.

దీంతో ఈ సినిమా బాగానే టాక్ సొంతం చేసుకుంది.  
అయితే ఇన్ని రోజులకు ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం అమెజాన్ లో ఆది సినిమానే ముందంజలో ఉందని చెప్పాలి. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఇక ఆది ఈ మధ్య చిన్న చిన్న సినిమాలతో వచ్చినప్పటికీ కూడా కొంతవరకు మంచి టాకే సొంతం చేసుకుంటున్నాడు. ఇలాగే మరో రెండు మూడు సినిమాలతో మంచి టాక్ సొంతం చేసుకుంటే మాత్రం.. గురుడు టాప్ లోకి రావడం ఖాయమని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: