ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు గడిచిన రెండు రోజుల క్రితం హైదరాబాద్లో చాలా ఘనంగా జరిగాయి. ఎంతోమంది రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు హాజరయ్యారు.. అయితే అందుకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాకపోవడంతో ఎన్టీఆర్ పైన నిరసనగలం వినిపిస్తోంది. హరికృష్ణ వివాహం చేసుకోకుండానే శాలినికి పుట్టిన వారు ఎన్టీఆర్ అంటూ ఇతను నందమూరి వారసుడు అంటూ పట్టం కడితే ఈరోజు పెద్దాయన జయంతి ఉత్సవాలకు కూడా రాలేని బిజీగా ఉన్నారు అంటూ పలువురు తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు అభిమానులు సైతం వ్యాఖ్యలు చేస్తున్నారు.


మరి కొంతమంది నీకంటూ ఏదిక్కులేదు నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టి దేశవ్యాప్తంగా పేరు తెచ్చిన నందమూరి కుటుంబానికి ఇంత అన్యాయం చేస్తారా అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు టిడిపి రాజకీయ నాయకులు.. మరి కొంతమంది పిలిచి పిల్లనిచ్చి పెళ్లి చేసి ఇంతటి వాడిని చేసిన చంద్రబాబుకి ద్రోహం  చేస్తారా అంటూ పలువురి నేతలు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.. కానీ ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ టిడిపి పార్టీ తరఫున ప్రచారం చేసేవారు చంద్రబాబు నాయుడు చూపించిన అమ్మాయిని వివాహం చేసుకున్న వాడే కానీ ఇదంతా బాగానే ఉన్నా తాత శతజయంతి ఉత్సవాలకు వెళ్లకపోవడంతో అందరూ ఎన్టీఆర్ అని పలు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.


కానీ వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇలాంటి ఉత్సవాలు చేయడం వల్ల కేవలం టిడిపి పార్టీకి ,బాబుకు తప్ప మరెవరికి లాభం లేదని ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుచేతనే శత జయంతి ఉత్సవాలకు కూడా వెళ్లలేదని ఒక వర్గం తెలియజేస్తోంది. ఇక్కడ కొన్ని రాజకీయ కారణాలవల్లే ఎన్టీఆర్ అక్కడకు వెళ్లలేదని సమాచారం. టిడిపి పార్టీకి తన తాత ఆది పురుషుడు లాంటి వ్యక్తి అయిన పార్టీని ఈరోజు ఎవరు నడిపిస్తున్నారు..ఎవరికి ప్రయోజనం ఉంది..ఎవరికి ప్రయోజనం కలుగుతుంది.. అసలు టిడిపి పార్టీకి ఏ విధంగా సంబంధం వారికి ఉంది అంటూ మరి కొంతమంది ప్రశ్నలు వేస్తున్నారు. ఇలాంటి వాటికి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండడమే మంచిది అంటూ అభిమానులు సైతం తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: