సీనియర్ రాజకీయ నేత చంద్రబాబు నాయుడు అపర హిందూ ప్రేమికుడిగా చెప్పుకోవడం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకప్పుడు సీఎంగా అధికార పగ్గాలు చేతిలో ఉన్నప్పుడు అన్ని మతాలు కులాలు సమానమేనని ఘంటాపథంగా చెప్పిన ఆయన, ఇప్పుడు ఇలా హిందూ మత ప్రీతి మయుడు గా మారిపోవడం దేనికి నిదర్శనం అర్థం కావడం లేదు అంటున్నారు కొందరు రాజకీయ నేతలు. ఇదంతా రాజకీయ లబ్ధి కోసమేనా... ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని క్రైస్తవుడు గా ప్రజలు గుర్తించేందుకు పడుతున్న తాపత్రయం అంటే...? ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

 రాజకీయం అన్న తర్వాత విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణం అలాగే సమయం దొరికితే ప్లస్ పాయింట్లు కూడా మైనస్ పాయింట్లుగా చూపుతూ టార్గెట్ చేస్తుంటారు ప్రత్యర్ధులు. మరి ఇప్పుడు చంద్రన్న ధోరణి చూస్తుంటే ఈ పాటికి అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఒకప్పుడు సీఎంగా వ్యవహరించిన సమయంలో  లౌకిక నేతగా చెప్పుకుంటూ అన్ని మతాలకు అతీతంగా మాట్లాడే చంద్రబాబు ఇప్పుడు ఇలా రూటు మార్చడం కొత్తగా అనిపిస్తుంది. సీఎం జగన్ లోని క్రైస్తవుడ్ని బయటకు తీసుకొచ్చేందుకు నానా తిప్పలు పడుతున్న ఆయన.. తాజాగా.. తాను హిందువునని చెప్పేందుకు ఏనాడు ఆలోచించలేదని, మన మతాన్ని మనం గౌరవిస్తూ అలాగే గర్వంగా చెప్పుకుంటూ.... ఇతర మతాలను కూడా గౌరవించడం లో తప్పు లేదని అన్నట్టుగా అభిప్రాయపడుతున్న చంద్రబాబు ఆంతర్యం ఏమిటో..? అంటున్నారు ప్రముఖులు.

తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అధికారంలో ఉన్న కాలంలో తాను హిందువునని చెప్పి.. వారి ఇష్టాలకు అనుగుణంగా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నారా? అన్నది ప్రశ్న. కానీ అలాంటిది ఎప్పుడూ జరగలేదు.... మరి అధికారంలో లేని ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు కారణం ఏమిటా అన్న ప్రశ్న తలెత్తుతోంది...అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడూ రాజకీయ లబ్ధి కోసం తమ మతాన్ని కాకుండా ఏ మతాన్ని నెత్తిన పెట్టుకోలేదు.... కనీసం అటువంటి ప్రచారాలకు వెళ్లినప్పుడు ఇతర మతాలకు సంబంధించిన కండువను ధరించడం కానీ, ఇతర మతాల భజన చేయడం కానీ చేయలేదు. అదేవిధంగా యూపీ సీఎం యోగిని తీసుకోండి. తాను హిందువునని ఓపెన్ గా చెప్పే ఆయన ముస్లింల వస్త్రధారణలో కనిపించింది లేదు.... ఇలా ఒక మతాన్ని బలంగా నమ్మి నప్పటికీ ఇతర మతాల జోలికి వెళ్లని వీరితో ఎటువంటి  సమస్య ఉండదు.

 అదేవిధంగా కులమతాలకు అతీతంగా నడుచుకునే సీఎం జగన్ ...
 ఈయన తాను ఫలానా మతస్థుడు అని ఎన్నడూ చెప్పింది లేదు.... అలాగే ఎప్పుడు ఏ మతాన్ని కించపరిచిన దాఖలాలు లేవు. ఇలాంటి వారితోను సమస్య ఉండదు... కానీ రాజకీయ ప్రయోజనం కోసం ఎప్పటికప్పుడు రంగులు మార్చే వ్యక్తులతోనే వస్తుంది అసలు చిక్కు. అయితే ఇప్పుడు చంద్రబాబు సడన్ గా నేను హిందువుని అంటూ ప్రచారాలు చేయడం ఎందుకో.... ఈ పాటికి అందరికీ అర్థమయ్యే ఉంటుంది అంటున్నారు కొందరు రాజకీయ నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: