కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసి, శాశ్వత నివాస చట్టాలను రద్దు చేసిన తర్వాత బయటి వ్యక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ ఆస్తులు కొని వ్యాపారాలు మొదలు పెడతారని భావించారు. కానీ అనూహ్యంగా ఏ మాత్రం రెస్పాన్స్ లభించలేదు. ఢిల్లీ మరియు పంజాబ్ నుంచి కేవలం ఇద్దరు 'బయటి వ్యక్తులు' జమ్ము జిల్లాలలో భూమిని కొనుగోలు చేశారు. అయితే, కాశ్మీర్ లోయలో ఇంతవరకు ఏ 'బయటి వ్యక్తి' భూమి లేదా ఇల్లు కొనలేదు. 

అధికారిక వివరాల ప్రకారం, న్యూఢిల్లీకి చెందిన నీలం గుప్తా మరియు ప్రశాంత్ గుప్తా జమ్మూలోని చన్నీ-హిమ్మత్ వద్ద ఒక భూమిని కొనుగోలు చేయగా, పంజాబ్ నివాసి అయిన బిందు వర్మ మరియు వీణా సరాఫ్ జమ్ము జిల్లాలోని చన్నీ-బిజి వద్ద ఒక భూమిని కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం జనవరిలో భూమి అతని పేరు మీద నమోదు చేయబడింది. జమ్మూకు చెందిన రితేష్ భాగోత్రా మరియు కాట్రాకు చెందిన అమిత్ ఖజురియా ఇద్దరు బయట వారికి భూమిని విక్రయించిన యజమానులుగా ఉన్నారు.

వివరాల ప్రకారం, ఈ వ్యక్తులు ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో ఆస్తి కొనుగోలు చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానంలో జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత, ఇద్దరు బయట వ్యక్తులు భూమిని కొనుగోలు చేశారని చెప్పారు. ఆగస్టు 5, 2019 కి ముందు, జమ్మూ కాశ్మీర్ శాసనసభ రాజ్యాంగపరంగా పూర్వ రాష్ట్రంలోని నివాసిని నిర్వచించే అధికారం కలిగి ఉంది. ఈ నిర్వచించిన నివాసితులు ఉద్యోగం లేదా స్థిరమైన ఆస్తి కోసం మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కానీ హోం మంత్రిత్వ శాఖ 2010 - వికేంద్రీకరణ మరియు నియామక చట్టం ద్వారా  'శాశ్వత నివాసితులు' అనే పదాన్ని 'జమ్మూ కాశ్మీర్ నివాసం' అని మార్చి గత సంవత్సరం సవరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: