ఝార్ఖండ్ లో ప్రస్తుతం రాజకీయం ఎంతో హాట్ హాట్ గా ఉంది. ఇక్కడ బీజేపీ ఇతర పార్టీ జేఎంఎం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అందుకే బీజేపీ అధిష్టానం ఇక్కడ ఎలాగైనా ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రణాళికలు రచిస్తోంది. అందుకే సీఎం హేమంత్ సొరేన్ పై ఎమ్మెల్యే అనర్హత వేటుకు అంతా రంగం సిద్ధం అయింది. ఇక తుది నిర్ణయం ఝార్ఖండ్ గవర్నర్ మీద ఆధారపడి ఉంది. కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం దాదాపుగా హేమంత్ సొరేన్ ఎమ్మెల్యే గా అనర్హుడు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా ఇప్పుడు ఝార్ఖండ్ సీఎం ఎవరు కానున్నారు అన్న అంశం బాగా చర్చలోకి వచ్చింది.

మాములుగా సీఎం ఇంటిలో లేదా బంధువుల్లో అర్హత కలిగిన వారు ఉన్నారా అన్నది చూస్తారు. కాగా ఈ సీఎం ఎవరు ? అన్న విషయంలో కొన్ని పేర్లు తెరముందుకు వస్తున్నాయి. వారిలో ప్రధములు దాదాపుగా సీఎం కుర్చీ ఎక్కే అవకాశం హేమంత్ సొరేన్ భార్య కల్పనా సొరేన్ కె ఉందని వార్తలు వినబడుతున్నాయి. కానీ ఈమెకు ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేకపోవడం మైనస్ అని చెప్పాలి. అయినా తన భర్త వెన్నంటే ఉండి నడిపించే అవకాశం ఉన్నపుడు సీఎం గా ఉండడానికి సమస్య ఏమీ ఉండదు. కాగా హేమంత్ తండ్రి శిబూ సొరేన్ కూడా ఉన్నా ఆయనపై ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి. కాబట్టి ఆయనకు అవకాశం లేదు.

ఇక హేమంత్ తల్లి పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ భార్య ఉండగా తల్లికి సీఎం కుర్చీ దక్కుతుందా అన్న వాదనల నడుమ అది జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఇక హేమంత్ ఇంతవాడు కావడానికి కారణం తన అన్న దుర్గ సొరేన్ భార్య సీత సొరేన్ కు అన్ని అర్హతలు ఉన్నాయి. భర్త దుర్గ సొరేన్ అకాల మరణంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన సీత సొరేన్ జామా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినప్పటికీ కల్పనా సొరేన్ కే సీఎం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మరి తొందరలోనే ఝార్ఖండ్ కు లేదు సీఎం రానుంది. అయితే ఈ పరిణామం బీజేపీకి మింగుడు పడదని అర్ధం అవుతోంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చాలని పన్నాగం పన్నుతున్న బీజేపీకి ఇది షాక్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: