మహా రాజకీయాల్లో ఎన్నో మలుపులు ఎన్నో పరిణామాలు ఎన్నో సమీకరణాలు ఎన్నో ఎత్తులు ఎన్నో పై ఎత్తులు మధ్య  మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అండగా ఉంటానంటూ ముందుకొచ్చిన ఎన్సీపీ నేత అజిత్ పవార్... చివరి నిమిషంలో వెన్ను చూపడంతో ప్రభుత్వ ఏర్పాటుకు తమకు సంఖ్యాబలం లేదు అంటూ బీజేపీ తేల్చింది . శనివారం అనూహ్యంగా తెరమీదకు వచ్చి అందరికి షాక్ ఇస్తూ ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవిస్... ఇక ఇప్పుడు పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మహారాష్ట్రకు కేవలం మూడున్నర రోజులు సీఎంగా మాత్రమే మిగిలిపోయారు ఫడ్నవీస్ . దీంతో ఫడ్నవీస్  సీఎం పదవి మూన్నాళ్ళ ముచ్చటగా అయిపోయింది. అయితే ఫడ్నవీస్  ఒక్కరే కాదు ఇలా మూన్నాళ్ళ ముచ్చటగా  ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వారు ఎవరో తెలుసుకుందాం రండి

 

 

 

 కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప గత ఏడాది కేవలం రెండు రోజుల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి ఆ తర్వాత రాజీనామా చేశారు. 2008 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు బిజెపి పార్టీ అత్యధిక మెజారిటీ సీట్లు సాధించినప్పటికీ  ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మెజారిటీ  మాత్రం సాధించలేకపోయింది. దీంతో  కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఆ తర్వాత ప్రమాణ స్వీకరం చేశారు. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు ఎమ్మెల్యేల సంఖ్యాబలం నిరూపించుకోక  పోవడంతో ఓ భావోద్వేగ  ప్రసంగం చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. యడియూరప్ప  రాజీనామా చేసిన అనంతరం కాంగ్రెస్ జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర తర్వాత ఇటీవలే మరోసారి కర్ణాటక రాజకీయ సంక్షోభం తలెత్తి  జేడీఎస్  కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి  ఎడ్యూరప్ప నాలుగోసారి సీఎం గా పదవీ సీట్ లో కూర్చున్నారు. 

 

 

 చరిత్రలోనే అతి తక్కువ సమయం ముఖ్యమంత్రి గా నిలిచిపోయిన ఉత్తరప్రదేశ్కు చెందిన జగదాంబికా పాల్. ఈయన కేవలం  ముఖ్యమంత్రి పదవిలో ఒక్కరోజు మాత్రమే ఉన్నారు. మొదట బిజెపికి చెందిన కళ్యాణ్ సింగ్  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ బిజెపేతర నేతలకు మంత్రి పదవులు ఇవ్వడం తో గవర్నర్ అభ్యంతరం తెలుపుతూ రాత్రికి రాత్రి ప్రభుత్వాన్ని రద్దు చేయగా.... ఆ తర్వాత కాంగ్రెస్ కు చెందిన జగదాంబికా పాల్ ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత బలనిరూపణ చేసుకోకపోవడంతో ఒక్కరోజులోనే జగదాంబికా పాల్ ప్రభుత్వం కూలిపోయి మరోసారి కళ్యాణ్ సింగ్ ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు. 

 

 

 

 సతీష్ ప్రసాద్ సింగ్ బీహార్కు చెందిన పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రిగా మొదట ఎన్నికయ్యారు. ఆ తర్వాత పార్టీలో అంతర్గత విభేదాలు ఏర్పడడంతో స్వచ్ఛందంగా వారం రోజులకే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎస్సీ మారక్  మేఘాలయ కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు. ఆ తర్వాత కూటమి చీలిపోవటంతో  13 రోజులపాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అన్న డీఎంకే  వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ సతీమణి జానకి రామచంద్రన్ కూడా అతి తక్కువ రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగిన లిస్టులో ఉన్నారు. ఎన్టీఆర్ మృతి తర్వాత జానకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు... అయితే దీనిపై ఆందోళన జరగడంతో రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జానకి రామచంద్రన్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. దీంతో ఇరవై మూడు రోజుల పాటు ఆమె ముఖ్యమంత్రిగా కొనసాగిన తరువాత రాజీనామా చేయాల్సి వచ్చింది. 

 

 

 

 ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన సిహెచ్ మహమ్మద్  కోయ  1979 న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల 45 రోజులు మాత్రమే పదవిలో కొనసాగి ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాక ఇక్కడ తెలిపిన వారందరికీ ముఖ్యమంత్రి పదవి  మూన్నాళ్ళ ముచ్చటగా మారింది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వీరు  పనిచేసినప్పటికీ కొన్నిసార్లు మాత్రం ముఖ్యమంత్రి పదవి లో కొన్ని రోజులు మాత్రమే కొనసాగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: