రాజకీయాల్లో కులాలు, వర్గాలు, మతాలు అనే కాన్సెప్ట్ తోనే గతంలో ఆయా పార్టీలు టికెట్ లు ఇస్తుండేవి. ప్రస్తుతం మాత్రం తమ వెంట ఉండే నాయకులను మాత్రమే ఆదరిస్తున్నారు ఆయా పార్టీల అధినేతలు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ముస్లింలకు 8,9 సీట్లు ఇచ్చేది. బీజేపీ తరఫున నిలబడే ముస్లింలకు ఓటేయం, సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ తరఫున నిలబడే ముస్లింలకు ఓటేస్తాం అని అక్కడి ముస్లింలు అనడంతో బీజేపీ ఆ 8 మందికి కూడా టికెట్లను ఇవ్వలేదు. తర్వాత వేరే వారికి సీట్లు ఇచ్చేశారు.


ప్రస్తుతం జగన్, కేసీఆర్ లు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. సీఎం కేసీఆర్ బీసీలకు దగ్గరై వారి ఓట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో గెలిచారు. ఎస్టీ, ఎస్సీలను ఎక్కువగా పట్టించుకోకపోవడంతో ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలిచింది. 100 కు 95 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఆంధ్రలో టీడీపీకి అనుకూలంగానే ఉంటారు. అందుకే కొంతమంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవులు ఇచ్చి మళ్లీ వెనక్కి తీసేసుకున్నారు జగన్. కొడాలి నాని ఇందుకు ఉదాహరణ.


ముఖ్యంగా కాపులు పోయిన ఎన్నికల్లో ఎక్కువగా వైసీపీకి ఓట్లు వేశారు. ఎందుకంటే టీడీపీ పార్టీ కాపు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరిచిపోయింది. కాబట్టి వైసీపీకి ఏకపక్షంగా ఓట్లేశారు. రాజ్యసభలో బీసీలకు 50 శాతం ప్రస్తుతం ఎమ్మెల్సీల్లో కూడా 11 మంది బీసీలకు జగన్ సీట్లు ఇచ్చేశారు. కాపు సామాజిక వర్గానికి  ఇద్దరికే ఇచ్చారు. అంటే జగన్ పరోక్షంగా కాపులను పక్కకు పెట్టినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి చెందిన వారు పవన్ కళ్యాన్ తో పోతే పోయిన పర్లేదు.. బీసీలకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేసి వారి ఓట్లను అధిక సంఖ్యలో రాబట్టుకుని మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని జగన్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: